Girlfriend fight Man Open Flight Door| ఒక యువకుడు తన ప్రియురాలితో విమానం ప్రయాణంలో ఉన్నప్పుడు గొడవ పడ్డాడు. ఆ తరువాత అసహనంతో విమానంలోని ఎమర్జెన్సీ డోర్‌ని సునాయసంగా తెరిచేసి దూకబోయాడు. కానీ తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది అతడిని పట్టుకొని అదుపు చేశారు. ఈ ఘటన అమెరికాలోని లోగన్ ఎయిర్ పోర్ట్ లో జనవరి 7, 2025న సాయంత్రం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. అమెరికా భూభాగమైన పూర్టోరీకో దీవులకు చెందిన మొరెల్ టోర్రెస్ ఒక యువకుడు తన ప్రియురాలితో మసాచుస్సేట్స్ రాష్ట్రానికి కొన్ని రోజుల క్రితం విహారయాత్రకు వెళ్లాడు. ఆ తరువాత జనవరి 7న ఈ ప్రేమికులిద్దరూ మసాచుస్సేట్స్ లోని బోస్టన్ నగరం లోగన్ ఎయిర్ పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణం కోసం జెట్ బ్లూ విమానం ఫ్లైట్ 161 ఎక్కారు. అయితే విమానంలో కూర్చున్నాక ఇద్దరూ వాదించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇదంతా తోటి ప్రయాణికులు గమనిస్తూనే ఉన్నారు.
కాసేపు తరువాత మొరెల్ తన సీటు మీద నుంచి లేచి విమానం వెనుక భాగం వైపు వేగంగా నడుచుకుంటూ వెళ్లాడు. ఆ తరువాత ఎవరూ ఊహించని విధంగా అక్కడ నిలబడి తాను విమానం నుంచి దూకేస్తున్నానని కేకలు వేసాడు. దీంతో మొరెట్ సీటు ముందు భాగంలో కూర్చొన్న వ్యక్తి అతడిని గమనించి వెంటనే పరుగెత్తుకెళ్లాడు. కానీ అప్పటికే మొరెల్ విమానం ఎమర్జెన్సీ డోర్ ని తెరిచేశాడు.
Also Read: ఇంట్లో దొంగతనానికి వెళ్లి మహిళను ముద్దాడిన దొంగ.. ఎలా పట్టుకున్నారంటే..
ఆ సమయంలో విమానం గాల్లోకి ఎగిరే క్రమంలో ఉంది. దీంతో అతను కిందికి దూకడానికి ముందుగా ఎమర్జెన్సీ డోర్ వద్ద ఉన్న ఇన్‌ఫ్లేట్ వేని ఆన్ చేయబోయాడు. అది ఆన్ చేస్తే.. విమానంలో నుంచి గాలితో నిండిన పరుపు లాంటి నిచ్చిన ఎయిర్ పోర్ట్ నేల వరకు వస్తుంది. కానీ మొరెల్ అలా చేయకుండా తోటిప్రయాణికుడు గట్టిగా పట్టుకున్నాడు. మిగతా ప్రయాణికులను కూడా తనకు సాయం చేయాలని పిలిచాడు. దీంతో ఈ విషయం విమాన సిబ్బందికి తెలిసి.. వారు కూడా పరుగులు తీస్తూ అక్కడికి వచ్చారు. వారంతా కలిసి మొరెల్.. కాళ్లు చేతులు కట్టేసి విమానంలోని బాత్రూంలో బంధించారు.
ఆ తరువాత విమానం ఎయిర్ పోర్ట్ లోనే ఆగిపోయింది. ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకొని మొరెల్ ని అరెస్టు చేశారు. మొరెల్ పై చట్ట ప్రకారం కేసు నమోదు అయింది. ప్రయాణికుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా చర్యలకు పాల్పడినందుకు అతడిపై ఆరోపణలు నమోదయ్యాయి. కానీ మొరెల్ తల్లిదండ్రలు అతడి బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ వేశారు.
మొరెల్ కు మానసిక వైద్యం అవసరమని కోర్టులో మొరెల్ తరపున లాయర్ వాదించాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ పూర్తి కాలేదు.