Ram Charan RC16: రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారారు రామ్ చరణ్(Ram Charan).. ఈ సంక్రాంతికి శంకర్(Shankar )దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేసి ఘోర పరాభవాన్ని చవిచూశారు. ప్రస్తుతం బుచ్చిబాబు(Bucchibabu ) దర్శకత్వంలో ‘ఆర్సి 16’ సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో నేటి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఆర్సీ 16 షూటింగ్ విషయంలో చాలా కఠిన నిబంధనలు, నియమాలు పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా రాజమౌళి చేసింది ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా రామ్ చరణ్ ఫాలో అవుతున్నారట. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఆర్సి 16 విషయంలో తప్పని నిబంధనలు..
గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్ గా పూర్తి డిసప్పాయింట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది పని కట్టుకొని మరీ ఈ సినిమా డిజాస్టర్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనికి తోడు ఈ సినిమాని లీక్ చేశారు. అంతేకాదు హెచ్డి ప్రింట్ కూడా లీక్ అయ్యిందంటే చరణ్ సినిమాని ఎంతగా చంపేయాలని ప్లాన్ చేశారో అర్థమవుతుంది. ముఖ్యంగా ఆయన సినిమాలే టార్గెట్గా కొంతమంది ఈ పని చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఇలాంటి విషయాలు మళ్లీ జరగకుండా రాబోయే సినిమాల విషయంలో పగడ్బందీ ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్. ఈ మేరకు చిత్ర బృందానికి ఒక కండిషన్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ఈరోజు షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చిన్న ప్రొడక్షన్ బాయ్ నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు ఎవరూ కూడా షూటింగ్ సెట్లోకి మొబైల్ తీసుకురావద్దని చెప్పారట. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని, తాను కూడా ఈ సినిమా షూటింగ్ కి సెల్ ఫోన్ తీసుకురానని చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి రామ్ చరణ్ , రాజమౌళి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
రాజమౌళి స్టేటజీని ఫాలో అవుతున్న రామ్ చరణ్..
ఇకపోతే రాజమౌళి.. తన సినిమా షూటింగ్లో ఎవరూ మొబైల్ ఫోన్ వాడడానికి లేదు అని రూల్ పెట్టారు. ముఖ్యంగా ప్రభాస్(Prabhas), రానా(Rana )కాంబినేషన్లో వచ్చిన రాజమౌళి సినిమా నుండి ఈ రూల్ పెట్టినట్లు తెలుస్తోంది ఇప్పటికీ అదే ట్రెండును ఫాలో అవుతున్నాడు. అందుకే ఆయన సినిమాల కంటెంట్ లీక్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.ఒక రకంగా చెప్పాలి అంటే రాజమౌళి లీక్ చేస్తే తప్ప ఈ సినిమా విషయాలు బయటకు రావడం లేదు. అందుకే రామ్ చరణ్ కూడా ఈ రూల్ ని ఆర్ సి 16 విషయంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి అయితే రాజమౌళి స్ట్రాటజీని రామ్ చరణ్ ఫాలో కాబోతున్నారు. మరి ఎలా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఇకపోతే పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాల్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Sivaraj kumar) కీలకపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా కబడ్డీ, క్రికెట్ వంటి క్రీడల చుట్టూ ఈ సినిమా సాగుతుందని ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం.