Big Stories

Upcoming Pan India Films: రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ మూవీల ఓటీటీ డీల్స్ ఫిక్స్.. కోట్లలో బిజినెస్!

game changer
game changer

Upcoming PAN-INDIA Films OTT Deals: ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ పాన్‌ ఇండియా సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. కనీ విని ఎరుగని రీతిలో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

- Advertisement -

ఇప్పటికీ ఈ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలపై హైప్ క్రియేట్ అయింది. అంతేకాకుండా ఈ సినిమాలు కూడా ఈ ఏడాది రిలీజ్ కాబోతుండటంతో అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ, అలాగే ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న దేవర మూవీ, ప్రభాస్ – దీపికా పదుకొనే కలిసి నటిస్తోన్న కల్కి మూవీలపై ఫుల్ బజ్ ఉంది.

- Advertisement -

ఈ మూవీలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. ముందుగా చూసుకుంటే.. రామ్ చరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలను పెంచేశాయి.

Also Read: బురద నీళ్లలో చిరంజీవి.. ‘విశ్వంభర’ కోసం మెగాస్టార్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

అలాగే ఈ మూవీలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒకటి సాదా సీదా వ్యక్తిగా, మరొకటి గవర్నమెంట్ అధికారిగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా ఒక్క సాంగ్ కోసం మూవీ యూనిట్ దాదాపు రూ.15 కోట్లను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జరగండి జరగండి అంటూ సాగే ఈ సాంగ్ కలర్ ఫుల్ లొకేషన్స్‌తో పాటు చాలా మంది డ్యాన్స్‌ర్లతో సందడి సందడిగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. హిందీతో కలిపి
ఏకంగా రూ.105 కోట్లకు ఈ మూవీ ఓటీటీ హక్కులకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అలాగే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర’ మూవీపై కూడా అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ రెండు పార్టులుగా రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్ మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి.

Also Read: ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అల్లు అర్జున్.. పుష్ప 2 కోసమేనా?

ఇదిలా ఉంటే ఈ పాన్ ఇండియా మూవీ ఓటీటీ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అన్ని భాషలతో కలిపి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ని ఏకంగా రూ.155 కోట్లకి సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఇక వీటితో పాటు ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై కూడా ఫుల్ హైప్ ఉంది. నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, రానా, దీపికా పదుకొనే వంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా ఎవరూ ఊహించని ధరకి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

ఏకంగా ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ అండ్ నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.180 కోట్లకు కొనుగోలు చేసే అవకాశముందని మూవీ మేకర్స్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. వీటిపై ఈ మూడు మూవీల మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News