Ram Charan:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) అర్జెంట్ గా ఒక హిట్ కొట్టాల్సి ఉంది అని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే రాజమౌళి(Rajamouli )!డైరెక్షన్లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత రాజమౌళి సెంటిమెంట్ ప్రకారం, తండ్రితో నటించిన ‘ఆచార్య’ మూవీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ కూడా భారీ డిజాస్టర్ అవ్వడంతో నెక్స్ట్ సినిమాపై తన దృష్టంతా పెట్టారు రామ్ చరణ్.ఒకవేళ ఈ సినిమా గనుక బాలేకపోతే రామ్ చరణ్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకున్న హీరోగా మారిపోతాడు. అయితే బుచ్చిబాబు(Bucchi Babu) డైరెక్షన్లో రాబోతున్న సినిమా విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా రామ్ చరణ్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అయితే బుచ్చిబాబు సినిమా కోసం ఇప్పటివరకు చేయని కఠినమైన సాహసం చేస్తున్నారట రామ్ చరణ్. మరి ఇంతకీ రాంచరణ్, బుచ్చిబాబు సినిమా కోసం చేసే ఆ సాహసం ఏంటో ఇప్పుడు చూద్దాం..
బుచ్చిబాబు సినిమా కోసం 10 కిలోల బరువు తగ్గనున్న చరణ్..
శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాఫ్ అవ్వడంతో రామ్ చరణ్ అభిమానుల ఆశలన్నీ బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న సినిమా పైనే ఉన్నాయి.ఆర్సీ 16 (RC16) సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా జాన్వీ కపూర్(Janhvi Kapoor) కూడా ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. మూడో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం రామ్ చరణ్(Ram Charan) ఒక పెద్ద సాహసం చేస్తున్నారట. అదేంటంటే..ఫ్లాష్ ప్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ దాదాపు 10 కిలోల బరువు తగ్గి కనిపిస్తాడట. టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ ఈ సినిమాలోని మొదటి పాత్ర కోసం ప్రస్తుతం ఉన్న వెయిట్ తో కనిపిస్తారట. అయితే ఫ్లాష్ బ్యాక్ పాత్రలో కనిపించడానికి మాత్రం ఏకంగా 10 కిలోల బరువు తగ్గి కనిపిస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్ పెద్ద సాహసమే చేశారని చెప్పుకోవచ్చు.ఎందుకంటే 10 కిలోల బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు.
సినిమా హిట్ కొట్టడం కోసం చిరంజీవి భారీ ప్రయత్నం..
ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం మెగా అభిమానుల ఆశలన్నీ RC16 సినిమా పైనే ఉండడంతో రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై ఫోకస్ పెట్టారు. అలాగే కొడుకు కోసం చిరంజీవి (Chiranjeevi) కూడా కథలో డెప్త్ ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అయితే ఈ సినిమాపై మెగా అభిమానులకి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎందుకంటే సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహించినప్పటికీ కథ మాత్రం సుకుమార్ (Sukumar) అందివ్వడంతో మెగా ఫ్యాన్స్ కి సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. మరి చూడాలి రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న సినిమా మెగా ఫ్యాన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో..ఈ సినిమాలోనైనా జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటనని బయట పెడతారా.. ? లేక దేవర (Devara) సినిమాలో చూపించినట్టే జాన్వీ కపూర్ ని కేవలం గ్లామర్ కే పరిమితం చేస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.