Virat Kohli: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడవ వన్డేలో… విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఫామ్ లోకి వచ్చాడు. బ్యాటింగ్ ప్రారంభం నుంచి… ఇప్పటి వరకు దూకుడుగా ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ). ఈ తరుణంలోనే… లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ. ఆసియాలో… 16 వేల పరుగులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు నమోదు చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. తక్కువ ఇన్నింగ్స్ లో… అంతర్జాతీయ మ్యాచ్ లలో 16 వేల పరుగులు చేసిన తొలి ఆసియా ప్లేయర్ గా… చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ.
Also Read: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఈ ప్రమాదకరమైన బౌలర్లు ఔట్.. టెన్షన్ లో ఐపీఎల్ ఓనర్స్ ?
కేవలం 340 ఇన్నింగ్స్ లోనే విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ 353 ఇన్నింగ్స్ లలో.. 16 వేల మార్కును దాటారు. అయితే సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) రికార్డును… వరుసగా బద్దలు కొట్టుకుంటూ వస్తున్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు ఆసియాలోనే ఫాస్టెస్ట్.. 16000 పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఇక విరాట్ కోహ్లీ అలాగే సచిన్ టెండూల్కర్ తర్వాత శ్రీలంక ప్లేయర్లు కుమార సంగకర, మహిళా జయవర్ధనే తర్వాతి స్థానాలలో ఉన్నారు. 360 ఇన్నింగ్స్ లలో కుమార సంగకర… 16 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అటు మహిళా జయవర్ధన 401 ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయి అందుకున్నాడు. అయితే టాప్ 4 లో ఉన్న ఈ ఆటగాళ్లలో… విరాట్ కోహ్లీ ఒక్కడే క్రికెట్ ఆడుతున్నాడు.
మిగతా ముగ్గురు ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అంటే విరాట్ కోహ్లీ రికార్డును… ఇకపై ఏ క్రికెట్ టచ్ కూడా చేయలేడు అన్నమాట. అంతేకాదు ఇదే మ్యాచ్ లో మరో రికార్డు బద్దలు కొట్టాడు ఓ విరాట్ కోహ్లీ. ఇంగ్లాండ్ జట్టు పైన వన్డేలలో 4000 పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు విరాట్ కోహ్లీ. వన్డే, టి20 అలాగే టెస్ట్ మ్యాచ్ ఇలా అన్ని ఫార్మాట్లు కలిపి.. ఇంగ్లాండ్ తట్టుపైన 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పటికే ఆస్ట్రేలియాపై 5 వేలకు పైచిలుకు పరుగులు చేసిన విరాట్ కోహ్లీ… వెస్టిండీస్ పై కూడా 4000 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లాండ్ పై 4000 పరుగులు చేసి రికార్డు సృష్టించారు.
ఇది ఇలా ఉండగా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కంటే ముందే.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫాంలోకి వచ్చి… 50కి పైగా పరుగులు చేయడంతో… ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. భారత్ vs ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ కారణంగా… టీమిండియాకు ప్లస్ అయిందని అంటున్నారు. అటు భారత్ vs ఇంగ్లండ్ మధ్య మూడో వన్డేలో.. హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు విరాట్ కోహ్లీ. దీంతో క్రీజులో గిల్ 72, శ్రేయస్ అయ్యర్ 1 పరుగుతో ఉన్నారు. 21 ఓవర్లలో భారత్ స్కోరు 134/2 గా ఉంది.
Also Read: Ind vs Eng 3rd ODI: బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..షమీతో పాటు మరో ఇద్దరు ఔట్
Fastest to 16,000 international runs in Asia:
340* innings – Virat Kohli 🇮🇳
353 innings – Sachin Tendulkar 🇮🇳
360 innings – Kumar Sangakkara 🇱🇰
401 innings – Mahela Jayawardene 🇱🇰 pic.twitter.com/snt7LuMY8B— Gurlabh Singh (@Gurlabh91001251) February 12, 2025
Virat Kohli complete 4000 Runs vs England.
(All Formats)
5243 – vs Australia
4076 – vs West Indies
4000*- vs England pic.twitter.com/BDFHKOCxQf— Gurlabh Singh (@Gurlabh91001251) February 12, 2025