SCR Special Trains: వీకెండ్ లో ఏపీకి వెళ్లే ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వీకెండ్ రద్దీని దృష్టిలో పెట్టుకుని చర్లపల్లి నుంచి కాకినాడ, నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. అదనపు రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
వీకెండ్ ప్రత్యేక రైళ్ల వివరాలు
చర్లపల్లి-కాకినాడ టౌన్- చర్లపల్లి ప్రత్యేక రైళ్లు
ఈ నెల 14న 07031 నెంబర్ గల ప్రత్యేక రైలు రాత్రి 7. 20 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది. అదే రైలు(070332) తిరుగు ప్రయాణంలో భాగంగా 16న సాయంత్రం 5.55 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయల్దేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
ఇక ఈ నెల 21న 07031 నెంబర్ గల ప్రత్యేక రైలు రాత్రి 7.20 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. తర్వాత రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది. అదే రైలు (070332) తిరుగు ప్రయాణంలో భాగంగా ఈ నెల 23న సాయంత్రి 5.55 గంటలకు కాకినాడ టౌన్ లో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
చర్లపల్లి – కాకినాడ టౌన్ రైళ్లు ఎక్కడెక్కడ ఆగుతాయంటే?
చర్లపల్లి – కాకినాడ టౌన్-చర్లపల్లి ప్రత్యేక రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
చర్లపల్లి-నర్సాపూర్-చర్లపల్లి ప్రత్యేక రైళ్లు
ఇక ఈ నెల 14న 07233 నెంబర్ గల ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి సాయంత్రం 7.15 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది. ఇదే రైలు(07234) తిరుగు ప్రయాణంలో ఈ నెల 16న రాత్రి 8 గంటలకు నర్సాపూర్ లో బయల్దేరుతుంది. మరుసటి రోజు 8 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
ఈ నెల 21న 07233 నెంబర్ గల ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి సాయంత్రం 7.15 నిమిషాలకు బయల్దేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. ఇదే రైలు (07234) తిరుగు ప్రయాణంలో ఈ నెల 23న నర్సాపూర్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ఈ రైలు చర్లపల్లికి చేరుకుంటుంది.
Read Also: గుడ్ న్యూస్.. ఇక ఆ స్టేషన్‌లోనూ ఆగనున్న సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ రైలు!
చర్లపల్లి – నర్సాపూర్ ప్రత్యేక రైళ్లు ఎక్కడెక్కడ ఆగుతాయంటే?
ఈ ప్రత్యేక రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
"Special Trains between Charlapalli – Kakinada Town & Charlapalli – Narsapur during Weekends" #SpecialTrains pic.twitter.com/5w1N8YCzQq
— South Central Railway (@SCRailwayIndia) February 12, 2025
Read Also:వందే భారత్ రైల్లో కమ్ముకున్న పొగ, అసలు సంగతి తెలిసి ప్రయాణీకులు షాక్!