Ram Charan.. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఒకేసారి గ్లోబల్ స్టార్ అయిపోయారు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత అదే స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారు అనుకున్నారు. కానీ ఆయన చేసిన ఆచార్య (Acharya), ఈ ఏడాది వచ్చిన గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలు రెండూ కూడా డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఎలాగైనా సరే సక్సెస్ కొట్టాలని ప్రముఖ యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Bucchibabu Sana ) దర్శకత్వంలో ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ఆర్సి 17 సినిమాను ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం. ఇలా రెండు బడా ప్రాజెక్టులు చేతిలో ఉండగానే.. మరొకవైపు బాలీవుడ్ నిర్మాత కం డైరెక్టర్ తో ఏకంగా మూడు సినిమాలు చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అదృష్టం మామూలుగా లేదుగా.. భారీ జాక్ పాట్ కొట్టబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సౌత్ హీరోలను లైన్ లో పెడుతున్న కరణ్ జోహార్..
బాలీవుడ్ లో ఎన్నో సంచలనాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దర్శకుడిగా, నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించిన కరణ్ జోహార్.. ఏదైనా ప్రాజెక్టు చేస్తున్నాడు అంటే కచ్చితంగా అది సూపర్ హిట్ అవుతుందని అక్కడి ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. అంతలా ఆ రేంజ్ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ‘బాహుబలి’ సీరీస్ బాలీవుడ్ లో ఆ స్థాయి ప్రభంజనం సృష్టించడానికి మూల కారణం కూడా కరణ్ జోహార్. కనీ విని ఎరుగని రేంజ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయ్యేలా చేశాడు. ఇకపోతే కరణ్ జోహార్ దృష్టి చాలాకాలంగా బాలీవుడ్ హీరోల నుండి టాలీవుడ్ హీరోల వైపు వెళ్లిన విషయం తెలిసిందే. ఎందుకంటే బాలీవుడ్ హీరోల క్రేజ్ తగ్గిపోవడం, ఇలాంటి హీరోలతో సినిమాలు చేస్తే కేవలం నార్త్ వరకే వసూళ్ళు పరిమితం అవ్వడం, ఫలితంగా సౌత్లో కలెక్షన్స్ లేకపోవడం.. ఇక వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు భారీ కలెక్షన్స్ వసూలు చేయాలి అంటే సూపర్ క్రేజ్ ఉన్న సౌత్ హీరోలను లైన్ లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట.
రామ్ చరణ్ తో ఏకంగా 3 సినిమాలు..
అందులో భాగంగానే ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ను లైన్లో పెట్టబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రామ్ చరణ్ తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల భారీ డీల్ కుదిరిందని అటు బాలీవుడ్ లో కూడా చర్చ నడుస్తోంది. అందులో ఒకటి ‘కిల్’ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తో ఒక సినిమా ఉండబోతుందని సమాచారం. మొదట ఈ ప్రాజెక్టుని విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో చేయాలని ప్లాన్ చేశారట. కానీ ఏమైందో తెలియదు.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు రామ్ చరణ్ చేతుల్లోకి వచ్చినట్లు సమాచారం. ఇక మరో రెండు సినిమాలకి కూడా క్రేజీ డైరెక్టర్స్ నే కరణ్ జోహార్ రామ్ చరణ్ కోసం రంగంలోకి దింపాలని ప్లాన్ చేశారట. ఏది ఏమైనా ఒకవేళ ఈ వార్తలు నిజమైతే మాత్రం రామ్ చరణ్ అదృష్టం మామూలుగా లేదని అభిమానులు కూడా కామెంట్ చేసేస్తున్నారు.