IRCTC Wayanad Tour: కేరళ అంటే పచ్చని అటవీ ప్రాంతం, కొండలు, ప్రకృతి అందాలకు నిలయం. అక్కడ పర్యటించాలని చాలా మంది ఆశిస్తారు. మీరు కూడా కేరళలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకుంటున్నారా? అయితే మీకో అద్భుతమైన అవకాశం ఉంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కేరళలోని వయనాడ్ ప్రాంతంలోని అనేక ప్రదేశాలను సందర్శించేందుకు ఒక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు సాగుతుంది? ధర ఎంత? ఏ ఏ ప్రదేశాలు కవర్ చేయబడతాయి? ఇప్పుడు చూద్దాం…
ఈ ప్యాకేజీని ఐఆర్సీటీసీ ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ నుండి రైలు ప్రయాణంతో ఈ టూర్ ప్రారంభమవుతుంది. వయనాడ్ లోని అనేక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఈ ప్యాకేజీలో ఉంది. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 రోజులు సాగుతుంది. ప్రతి మంగళవారం ఈ ప్రయాణం ఏర్పాటు చేయబడుతుంది. ప్రయాణ వివరాలు ఇలా ఉన్నాయి:
మొదటి రోజు: ఉదయం 6 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి మంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
రెండవ రోజు: ఉదయం 6:17 గంటలకు కన్నూర్ చేరుకుంటారు. అక్కడ ముందుగానే బుక్ చేసిన హోటల్ లో చెక్-ఇన్ చేసి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అనంతరం సెయింట్ ఏంజెలో ఫోర్ట్, అరక్కల్ మ్యూజియం సందర్శిస్తారు. ఆ తర్వాత వయనాడ్ కు ప్రయాణం ప్రారంభమవుతుంది. మధ్యలో కొన్ని పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఆ రాత్రి కాల్పెట్టా లో బస చేస్తారు.
మూడవ రోజు: ఉదయం హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత కురువాడీప్ లోని అనేక ప్రదేశాలను సందర్శిస్తారు. తిరునెల్లి ఆలయం, బాణాసూర సాగర్ డామ్ ను సందర్శిస్తారు. ఆ రాత్రికి కూడా కాల్పెట్టా లోనే బస చేస్తారు.
నాల్గవ రోజు: బ్రేక్ ఫాస్ట్ తర్వాత అంబల్వాయల్ హెరిటేజ్ మ్యూజియం, స్కూయిపారా ఫాల్స్, ఎడక్కల్ గుహలు, పొక్కొడే సరస్సు సందర్శిస్తారు. రాత్రి కాల్పెట్టా లోనే బస చేస్తారు.
ఐదవ రోజు: బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుండి చెక్-అవుట్ చేసి కొజికోడ్ కు చేరుకుంటారు. కప్పడ్ బీచ్ సందర్శించిన తర్వాత సాయంత్రం ఎస్ఎం స్ట్రీట్ లో షాపింగ్ చేయవచ్చు. అనంతరం రాత్రికి కాలికట్ రైల్వే స్టేషన్ కు వెళ్తారు. ఆ రాత్రి 11:35 గంటలకు హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
ఆరవ రోజు: రాత్రి 11:40 గంటలకు కాచిగూడ చేరుకునే సమయానికి టూర్ పూర్తవుతుంది.
Also Read: దక్షిణభారత్ టూర్ ప్లాన్.. తక్కువ ధరకే రైలు ప్రయాణం ఎంజాయ్ చేస్తూ ప్రముఖ ఆలయాల దర్శనం
ఇలా బుక్ చేసుకోవాలి:
ఈ టూర్ ను బుక్ చేసుకోవడానికి ఇండియన్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి. లేదా “వండర్స్ ఆఫ్ వయనాడ్” అని సెర్చ్ చేసి సమాచారం పొందవచ్చు. ఈ ప్యాకేజీ ఫిబ్రవరి 25న హైదరాబాద్ నుంచి ప్రారంభమైంది. ప్రతి బుధవారం టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో ముందుగా ట్రైన్‌లో ప్రయాణం, ఆ తరువాత పర్యాటక స్థానాల్లో క్యాబ్ సౌకర్యం ఉంటుంది. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 రోజులు సాగుతుంది.
అందుబాటులో ఉన్న సౌకర్యాలు:
స్లీపర్ క్లాస్, 3AC రైలు ప్రయాణం.
ప్రయాణానికి ఏసీ వాహనం కేటాయిస్తారు.
3 రోజులపాటు అక్కడే హోటల్ స్టే ఉంటంది. దీంతో పాటు మూడు రోజుల కాంప్లిమెంటరీ అల్పాహారం (టిఫిన్) ఏర్పాట్లు కూడా ఉంటాయి.
ప్రయాణ ప్రణాళిక ప్రకారం అన్ని దర్శనీయ ప్రదేశాలను సందర్శించే అవకాశం.
టోల్, పార్కింగ్, జీఎస్టీ ఫీజులు ప్యాకేజీ ఫీజులో చేర్చబడ్డాయి.
ముగ్గురు వ్యక్తులతో ప్రయాణించాలంటే ప్యాకేజీ ధర రూ. 17,740.
అదే డబుల్ షేరింగ్ స్లీపర్ కోచ్ టూర్ ప్యాకేజీ తీసుకుంటే దాని ధర రూ. 18,430.
3AC కోచ్ తో టూర్ ప్యాకేజీని బుక్ చేసుకుంటే రూ. 21,220.
ఈ సౌకర్యాలు ప్యాకేజీలో లేవు:
అల్పాహారం తప్ప హోటల్ లో భోజనం, రాత్రి భోజనం అందుబాటులో ఉండవు.
రైలులో ఆహారం అందుబాటులో ఉండదు.
సందర్శనా స్థలాలకు ప్రవేశ టికెట్ ఉంటే, అదనంగా చెల్లించాలి.
గుర్రపు స్వారీ, బోటింగ్ లతోపాటు ఇతర వినోద కార్యకలాపాలకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
టూర్ గైడ్ సౌకర్యం అందుబాటులో ఉండదు.
టికెట్లు బుక్ చేసుకోవడానికి, మరింత సమాచారం కోసం ఇండియన్ రైల్వేస్ అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి.