Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సినిమాలకు యూత్ లో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రాలలో అత్తారింటికి దారేది సినిమా కూడా ఉంది. ఆ సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసిందో గతంలో మనం చూశాం. ఫ్యామిలీ కథా చిత్రం గా వచ్చిన ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదని ఫాన్స్ అంటున్నారు. సినీ అభిమానులు కూడా టీవీలో ఎన్ని సార్లు చూసినా ఈ సినిమాని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది అని అంటున్నారు. అంటే మూవీ అంత బాగా ఉందని అర్థం. మెగా హీరో పవన్ కళ్యాణ్ తో పాటు మరో హీరో కూడా ఉన్నట్లు మూవీ రిలీజ్ అయిన ఇన్నాళ్ల తర్వాత ఆ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీలో కనిపించిన ఆ హీరో ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
టాలీవడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. ఇక ఈ సినిమా విడుదల కంటే ముందే హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ తో లీక్ అయినప్పటికీ ఆరు రోజుల్లోనే 75 కోట్ల రూపాయలను వసూలు చేసిఅందరికి షాక్ ఇచ్చింది. ఇది అప్పటిలో మామూలు విషయం కాదు. ఈ మూవీని మొదట మహేష్ బాబు కోసం అని రాసుకున్న కథ అట.. కానీ చివరికి పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అయింది. రాజమౌళి దరికి ఎక్కించిన బాహుబలి సినిమా వచ్చేంతవరకు అత్తారింటికి దారేది మూవీ థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. అత్తారింటికి దారేది సినిమా రికార్డ్స్ ని ఏ స్టార్ హీరో కూడా బ్రేక్ చేయలేదు . ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం ఒక్క మాటలో చెప్పలేరు.
ఇదిలా ఉండగా ఈ మూవీలో ఎవరు ఊహించిన ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఇది కూడా మెగా హీరో. అవునా ఏంటి ఇది నిజమా సినిమాలో ఎక్కడ మెగా హీరోలు కనిపించలేదు కదా అని డౌట్ అందరికీ రావచ్చు. కానీ ఈ మూవీలో రామ్ చరణ్ కనిపిస్తాడని ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ బయటపెట్టాడు. ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశం లో పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో కదిలిచింది.. పవర్ స్టార్ లాంటి హీరో తో ఇంత ఎమోషనల్ క్లైమాక్స్ ని ప్లాన్ చెయ్యడం అంటే , త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాతే ఎవరైన అని ప్రశంసలు కురిపించవచ్చు…అయితే ఈ క్లైమాక్స్ సన్నివేశం లో నదియా పవన్ కళ్యాణ్ తో నాన్నకు ఫోన్ చేయరా గౌతం అనే సీన్ లో వాళ్ళిద్దరి మధ్యలో నుంచి ఒక షాడో కనిపిస్తుంది. ఆ షాడో మరెవరిదో కాదు రామ్ చరణ్ దేనట.. బాబాయ్ షూటింగ్ చూద్దామని రామ్ చరణ్ రోజు అక్కడికి వచ్చారట. ఫోన్ రావడంతో సెట్ బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడుతున్న రామ్ చరణ్ అనుకోకుండా ఆ సీన్ లో కనిపించాడు.. ఇన్నాళ్లకు ఈ విషయం బయటపడటంతో బాబాయి అబ్బాయి నిజంగానే స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటుందని మెగా ఫాన్స్ కోరుకుంటున్నారు. మరి మెగా ఫ్యాన్స్ కోరికను ఆ హీరోలు తీరుస్తారో లేదో చూడాలి..