BigTV English

OTT Movie : తల్లిదండ్రులనే బెదరగొట్టే కూతురి ఆత్మ… హడలెత్తించే హార్రర్ కథా చిత్రమ్

OTT Movie : తల్లిదండ్రులనే బెదరగొట్టే కూతురి ఆత్మ… హడలెత్తించే హార్రర్ కథా చిత్రమ్

OTT Movie : హారర్ సినిమాలు చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు అంతగా భయపెట్టకపోయినా స్టోరీ తో ఆకట్టుకుంటాయి. అయితే మరికొన్ని సినిమాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఒక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ, ప్రేక్షకులను బాగానే భయపెడుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో

ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హిస్ హౌస్‘ (His House). 2020లో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ ‘హిస్ హౌస్’ మూవీకి రెమి వీక్స్ దర్శకత్వం వహించారు. ఇందులో వున్మీ మొసాకు, సోప్ దిరిసు, మాట్ స్మిత్ నటించారు. ఈ మూవీలో దక్షిణ సూడాన్‌కు చెందిన శరణార్థి జంట మరొక ప్రాంతానికి వలస వెళ్తుండగా, కొత్త జీవితాన్ని సర్దుబాటు చేసుకోవడానికి వాళ్ళు ఎదుర్కునే సన్నివేశాలతో మూవీ స్టోరీ నడుస్తుంది. విమర్శకుల నుండి విస్తృతమైన ప్రశంసలను అందుకున్న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే 

సుడాన్ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉండటంతో హీరో, హీరోయిన్ తన కూతురితో కలిసి యూకే కంట్రీకి వస్తూ ఉంటారు. పడవ ప్రయాణం మీదగా వస్తున్న వీళ్ళకి ఒక ప్రమాదం జరుగుతుంది. అందులో కొంతమంది సముద్రంలో మునిగిపోగా, వాళ్ళల్లో హీరో కూతురు కూడా ఉంటుంది. ఈ బాధ నుంచి తేరుకుని యూకే కి వచ్చిన వీళ్ళకి, ఆదేశం పౌరసత్వం ఇవ్వకుండా వాళ్లని అబ్జర్వేషన్ లో పెడుతుంది. అక్కడ బయటి వాళ్లకి పౌరుషత్వం ఇవ్వాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. వాళ్ళు చెప్పిన ప్రాంతంలోనే నివసించాలి. వాళ్లు చెప్పిన పని చేయాలి. ఇలా కొంతకాలం చేశాక ఓకే అనుకుంటే, వలస వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఇస్తారు. ఈ క్రమంలో వీళ్ళు ఉండటానికి ఒక ఇంటిని ఇస్తారు అధికారులు. ఆ ఇంట్లో ఉంటున్న వీళ్ళకి అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. చనిపోయిన కూతురు ఆత్మ రూపంలో వచ్చి హీరోయిన్ ను భయపెడుతూ ఉంటుంది.

ఆ ఇంట్లో ఒక గోడ అవతల వైపు నుంచి శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ గోడలు బద్దలు కొట్టడానికి ట్రై చేస్తాడు హీరో. అయితే వీళ్ళని అబ్జర్వేషన్ లో ఉంచిన ఒక అధికారి అది చూసి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇలా చేస్తే మీకు శిక్ష పడుతుందని చెప్తాడు. ఆ తర్వాత ఆ దయ్యాల గోలతో భయపడిన హీరోయిన్, అక్కడినుంచి పారిపోతుంది. తనకు తెలిసిన వాళ్ళతో హ్యాపీగా గడుపుతూ ఉంటుంది. అయితే ఇదంతా హీరోయిన్ ఇమేజిన్ చేసుకుంటూ ఉంటుంది. నిజానికి వీళ్ళు వస్తున్న పడవలో ఉన్నది వీళ్ళ కూతురు కాదు. సైనికుల నుంచి తప్పించుకోవడానికి, ఆ చిన్న పిల్లని తన కూతురు అని చెప్పి అక్కడ నుంచి వస్తారు. దారి మధ్యలోనే ఆమె చనిపోవడంతో, ఆమెతోపాటు కొన్ని ఆత్మలు వీళ్ళను వెంటాడుతూ ఉంటాయి. చివరికి ఆ ఆత్మలను వీళ్ళు ఎలా ఎదుర్కొంటారనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘హిస్ హౌస్’ (His House) మూవీని మిస్ కాకుండా చూడండి.

Tags

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×