BigTV English
Advertisement

Anand Mahindra: నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులేసిన ఆనంద్ మహీంద్రా.. వీడియో వైరల్

Anand Mahindra: నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులేసిన ఆనంద్ మహీంద్రా.. వీడియో వైరల్

Anand Mahindra: టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రిలీజ్ అయి దాదాపు ఏడాది కావస్తున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచం మొత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది ఈ మూవీ. ఇటీవల జపాన్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ వసూల్ చేయనన్ని కలెక్షన్లను రాబట్టింది.


ఇక ఈ మూవీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నాటు నాటు సాంగ్ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అకాడమీ అవార్డులకు నామినేట్ అయింది. కచ్చితంగా ఈ సాంగ్‌కు ఆస్కార్ వస్తుందని అందరూ భావిస్తున్నారు. కీరవాణి రచించిన ఈ సాంగ్‌ను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఇక ఈ పాటకు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు వేరే లెవెల్ అసలు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు, క్రికెటర్లు ఈ సాంగ్‌కు స్టెప్పులేసి అలరించగా.. తాజాగా దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ సాంగ్‌కు స్టెప్పులేశారు.

ఈ కార్ రేసింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆనంద్ మహీంద్రా రామ్ చరణ్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నాటునాటు సాంగ్‌కు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెబుతూ.. ఈ సాంగ్ ఆస్కార్ అందుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×