Ram Charan : రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈవెంట్ డల్లాస్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం సుకుమార్ కూడా డల్లాస్‌కు వెళ్లాడు. బుచ్చిబాబు, సుకుమార్ ఇలా రామ్ చరణ్ కోసం వచ్చేశారు. ఈ ఈవెంట్ రామ్ చరణ్ ఎంట్రీ అదుర్స్.. ఆయన ఎంట్రీతోనే అక్కడ ఒక హైప్ ను క్రియేట్ చేశాడు. దాంతో గేమ్ ఛేంజర్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.. అక్కడకు వచ్చిన క్రౌడ్, నిండిన స్టేడియం, దిల్ రాజు, శంకర్, సుకుమార్ ఇచ్చిన స్పీచులు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ తన టీం గురించి చాలా గొప్పగా చెప్పాడు.. గేమ్ ఛేంజర్ మూవీ మీకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు. అంతేకాదు ఈ ఈవెంట్ లో పుష్ప 2 గురించి పొగిడేశాడు. ఆయన సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప 2 గురించి అల్లు అర్జున్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..
గేమ్ చేంజర్ ఈవెంట్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు వినిపించాయి. కానీ అల్లు అర్జున్ పేరు మాత్రం వినిపించకుండా చేసినట్లు తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ సైతం అల్లు అర్జున్ పేరు చెప్పలేదు. సుకుమార్ గురించి చెబుతూ.. పుష్ప 2 గురించి కూడా మాట్లాడాడు. పుష్ప 2 పెద్ద విజయాన్ని సాధించింది అని అన్నాడు.. సుకుమార్ టాలెంట్ ను మరోసారి బాక్సాఫీస్ వద్ద నిరూపించుకున్నాడు. ఇకపోతే రంగస్థలం సినిమాకే జాతీయ అవార్డు వస్తుందని చరణ్ గురించి సుకుమార్ అనుకున్నాడట. కానీ గేమ్ చేంజర్ క్లైమాక్స్‌లో రామ్ చరణ్ నటన చూసిన తరువాత ఈ సారి జాతీయ అవార్డు పక్కా వస్తుందని ఫిక్స్ అయ్యాడట సుక్కు.. గేమ్ ఛేంజర్ మూవీ గురించి సుకుమార్ చాలా బాగా చెప్పాడు..
ఇకపోతే పుష్ప 2 మూవీ గురించి మెగా హీరోలు రెస్పాండ్ అయినట్లు స్పందించలేదు. చిరంజీవి వద్దకు సుక్కు, మైత్రీ నిర్మాతలు వెళ్లి కలిశారు. చిరు ఆశీస్సులు తీసుకున్నారు. కానీ చిరు మాత్రం అప్పటిికి ఇంకా సినిమా చూడలేదు. ఇప్పటికైనా చూశాడా? లేదా? అన్నది తెలియదు. అల్లు అర్జున్ మూవీ సక్సెస్ అయినందుకు మెగా హీరోలు స్పందించలేదు. గతంలో లాగా సినిమా భారీ సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. కనీసం సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు. రామ్ చరణ్ అయితే ఇలా పుష్ప 2 సక్సెస్ మీద అయితే స్పందించాడు. సుకుమార్‌ను ఆకాశానికెత్తేశాడు. ఇక బుచ్చిబాబు ప్రాజెక్ట్ తరువాత రామ్ చరణ్ మళ్లీ సుకుమార్‌తోనే ఓ మూవీ చేయబోతున్నాడు.. ఇక సుకుమార్ పుష్ప 3 అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే..