BigTV English

OTT Movie : పరిచయం అయ్యాడని వెళితే… ఇంట్లోనే ఎనిమిది నెలలు కట్టేసి…

OTT Movie : పరిచయం అయ్యాడని వెళితే… ఇంట్లోనే ఎనిమిది నెలలు కట్టేసి…

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని చూడటానికి మూవీ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, థ్రిల్లర్ కంటెంట్ ఉండటంతో వీటిని చూస్తూ బాగా ఎంటర్టైన్ అవుతారు. అలాంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ పేరు ‘బెర్లిన్ సిండ్రోమ్‘ (Berlin syndrome). ఈ మూవీలో హీరో, హీరోయిన్ ని బంధించి తన కోరికలను తీర్చుకుంటూ ఉంటాడు. చివరికి హీరోయిన్ అతని నుంచి తప్పించుకునే సన్నివేశాలతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

క్లారా అనే అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి బెర్లిన్ కి వస్తుంది. ఈమె ఫోటోగ్రాఫర్ గా ప్రొఫెషన్ కొనసాగిస్తూ ఉంటుంది. బెర్లిన్ వచ్చిన క్లారాకి హ్యాండీ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ పరిచయంతో క్లారాని హ్యాండీ తన అపార్ట్మెంట్ కి తీసుకెళ్తాడు. అక్కడ మనుషులు ఎవరూ లేకపోవడంతో కాస్త అనుమానం పడుతుంది క్లారా. అయితే ఆరోజు రాత్రి వీళ్ళిద్దరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. వెళ్లేటప్పుడు హ్యాండీ డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోతాడు. సాయంత్రం తిరిగి వచ్చాక క్లారా లాక్ ఎందుకు వీసుకొని వెళ్ళావాని అడుగుతుంది. మరచిపోయి వెళ్లానని సమాధానం చెప్తాడు హ్యాండీ. మరుసటి రోజు వెళ్లేముందు తనకి కీ ఇవ్వమని అడుగుతుంది. కీ ఒక టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడు హ్యాండీ. ఆ కీతో డోర్ తీయడానికి పోతే, డోర్ ఎంతకీ తెరుచుకోదు. క్లారాకి అప్పుడు అర్థమవుతుంది హ్యాండీ తనని బంధించాడని. ఇక ఇలాగే ఎనిమిది నెలలు ఆ గడిలోనే ఉండిపోతుంది క్లారా. హ్యాండీ ఆమెతో ఏకాంతంగా గడిపి, స్కూల్ కి వెళ్లి మళ్లీ వచ్చి క్లారాతో ఏకాంతంగా  గడుపుతూ ఉంటాడు.

ఒక రోజు హ్యాండీ స్కూల్ నుంచి కొన్ని బుక్స్ తెస్తాడు. ఆ బుక్స్ లో క్లారా తనని బంధించిన ఫోటోని పెడుతుంది. ఆ బుక్ స్కూల్ కి తీసుకువెళ్లిన హ్యాండీ ఒక స్టూడెంట్ కి ఇస్తాడు. ఆ బుక్ లో క్లారాని బంధించిన ఫోటో ఒక స్టూడెంట్ చూస్తుంది. ఇదివరకే క్లారాని హ్యాండీతో చూసిన స్టూడెంట్, ఆమెను హ్యాండీ కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటుంది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఇంటికి వెళుతుంది. ఈ విషయం తెలుసుకున్న హ్యాండీ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాడు. చివరికి ఆ స్టూడెంట్ క్లారాని కాపాడుతుందా? క్లారాని హ్యాండీ ఏమైనా చేస్తాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బెర్లిన్ సిండ్రోమ్’ (Berlin syndrome) అనే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×