Big Stories

Stone attack on Sai dharam tej campaign: ఏపీలో వైసీపీ రాళ్ల దాడులు, సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో.. గాయపడిన జనసేన కార్యకర్త

Stone attack on Sai dharam tej campaign(Andhra politics news): ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు దారుణంగా తయార య్యాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అధికార వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఏకంగా ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు సైలెంట్ అయిపోయారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.

- Advertisement -

కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై ఆన్‌లైన్‌లో సర్వేలను విడుదల చేస్తున్నారు. సర్వే ఫలితాలు దాదాపుగా అధికార పార్టీ వైసీపీకి నెగిటివ్‌గా రావడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు కొందరు. తాజాగా కూటమి అభ్యర్థుల తరపున టాలీవుడ్ హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారం చేస్తున్నాడు. గన్నవరం తర్వాత తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చాడు.

- Advertisement -

ఆదివారం రాత్రి పిఠాపురం నియోజకవర్గంలోని తాటిపర్తిలో ప్రచారం చేస్తున్నాడు టాలీవుడ్ హీరో. సాయిధరమ్ తేజ్ కాన్వాయ్ వెళ్తుండగా వైసీపీ కార్యకర్తలు రాళ్లు, ప్లాస్టిక్ బాటిల్స్‌ను విసిరారు. రాయి కాస్త జనసేన కార్యకర్తను బలంగా తాకడంతో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వెంటనే ఆ వ్యక్తిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడానే ఉంది. పవన్‌కు మద్దతుగా సాయిధరమ్ తేజ్ ప్రచారం చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

సాయి ప్రచారానికి అనుహ్య స్పందన రావడంతో తట్టుకోలేక వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని జనసేన కేడర్ ప్రధాన ఆరోపణ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ బాధితులను పరామర్శించారు. తర్వాత మరో ప్రాంతానికి వెళ్లిన సాయిధరమ్ తేజ్ వైసీపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. సేనానికి సైనికుడిలా మాత్రమే వచ్చానంటూ సినిమా స్టయిల్‌లో చెప్పిన డైలాగ్స్‌కు ఓటర్ల నుంచి మాంచి స్పందన లభించింది. మీ ఓటుకు ఫ్యాన్ రాలిపోవాలన్నాడు. అలాగే ఈవీఎంల్లో అభ్యర్థుల నెంబర్ కూడా చెప్పుకొచ్చాడు.

ఓ రోజు వెనక్కి వెళ్తే.. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై మాడుగుల నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. పోలీసుస్టేషన్ సమీపంలో ఆయనపై దాడి చేసినా పోలీసులు సైలెంట్ అయిపోయారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి ముత్యాలనాయుడు సొంతూరు తారువకు వెళ్లిన బీజేపీ అభ్యర్థిపై దాడి చేశారు. కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తే తనను రెండు గంటలపాటు ఊరిలో అడుగుపెట్టనివ్వలేదని ఆరోపించారు సీఎం రమేష్. పోలీసులకు ముందుగా చెప్పినా ఏ మాత్రం రక్షణ చర్యలు చేపట్టలేదన్నారు. అనకాపల్లి ఎస్పీ, దేవరాపల్లి డీఎస్పీపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన ఈసీకి లేఖ రాశారు.

ALSO READ:  అనకాపల్లికి మోదీ, వైసీపీ ఛాలెంజ్, అలాగైతే తాను తప్పుకుంటా?

ప్రస్తుతం ఏపీ పరిస్థితి చూసినవాళ్లు మాత్రం.. నాలుగేళ్ల కిందట ఏపీలో జరిగిన లోకల్‌బాడీ ఎన్నికలు గుర్తు చేస్తున్నారు. అప్పుడూ టీడీపీ, జనసేన కార్యకర్తలపై వైసీపీ కేడర్ దాడులు చేసింది. ఆ ఘటనలో చాలా మంది గాయపడ్డారు, పలువురు తమ తమ నామినేషన్లను విత్ డ్రాలు చేసుకున్నారు. ఆ విధంగానే  ఇప్పుడు కూడా వైసీపీ ప్లాన్ చేసినట్టు ఉందని నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఈ వారం రోజుల్లో ఇంకెన్ని ఘటనలు చోటు చేసుకుంటాయో చూడాలి.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News