BigTV English

Game Changer Release Date: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడో తెలిసిపోయింది.. ఆ పండక్కే రానున్న గ్లోబల్ స్టార్..!

Game Changer Release Date: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడో తెలిసిపోయింది.. ఆ పండక్కే రానున్న గ్లోబల్ స్టార్..!

Ram Charan’s Game Changer Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్’. ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వత చరణ్ నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అదీగాక క్రియేటివ్ దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో మరింత క్యూరియోసిటీ ఏర్పడింది. ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సుమారు రూ.170 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.


అయితే 2021లో పట్టాలెక్కిన గేమ్ ఛేంజర్ ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ మూవీ ఇంకా షూటింగ్ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఇండియన్ 2 మూవీ. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు శంకర్ డైరెక్షన్ బాధ్యతలు తీసుకోవడంతో గేమ్ ఛేంజర్ లేట్ అవుతూ వస్తుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాను మేకర్స్ దీపావళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ ఏడాది దీపావళి బరిలో ఈ మూవీ నిలుస్తుందని తెలుస్తోంది. అయితే ఒకవేళ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోతే మరో ఆప్షన్‌ను కూడా లైన్‌లో పెట్టారట. సెకండ్ ఆప్షన్‌గా క్రిస్మస్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో మేకర్స్ దీపావళికే రిలీజ్ చేసేయాలని చూస్తున్నారని సమాచారం.


Also Read: హమ్మయ్య.. ముగింపు దశకు చేరుకున్న ‘గేమ్ ఛేంజర్’

ఎందుకంటే సెప్టెంబర్‌లో ఎన్టీఆర్ దేవర రిలీజ్ ఉంది. అలాగే డిసెంబర్‌లో పెష్పతో పాటు స్మార్ట్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందువల్ల ఈ రెండు సినిమాల గ్యాప్‌లోనే గేమ్ ఛేంజర్ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ రిలీజ్ డేట్ పై త్వరలోనే అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×