BigTV English

YCP Cadre: జగన్ షాకింగ్ నిర్ణయం.. టెన్షన్‌లో క్యాడర్

YCP Cadre: జగన్ షాకింగ్ నిర్ణయం.. టెన్షన్‌లో క్యాడర్

గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐ ప్యాక్ టీమ్ ఆ పార్టీకి దూరమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే బెజవాడలోని తమ కార్యాలయాలను సైతం ఖాళీ చేసిన ఐప్యాక్ టీమ్ తట్టా బుట్టా సర్దేసుకుంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితమైన ఆ పార్టీని పునర్నిర్మాణం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ తన సలహాదారుడిగా ఆళ్ల మోహన్ సాయిదత్‌ను నియమించుకున్నారన్న ప్రచారమూ నడిచింది. అయితే ఎందుకో కాని అది వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. ఈ మధ్య గ్యాప్‌లో పార్టీ వ్యవహారాల్లోకి తిరిగి ఐ ప్యాక్ రీ ఎంట్రీ ఇచ్చేసిందట.

ఐ ప్యాక్ బృందం సభ్యులు తమ పనులు తాము మొదలు పెట్టేశారట. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే వైసీపీ గెలుస్తుందని జగన్ భావించారు. అయితే వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం అవ్వడంతో తమ పార్టీకి ఎన్నికల వ్యూహాల కోసం ఆ పార్టీ అధినేత జగన్ ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని పీకే టీమ్ ను రంగం లోకి దించారు. 2017లో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఎంట్రీ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్.. ఓ భారీ బహిరంగ సభలో తమ పార్టీ శ్రేణులకు ప్రశాంత్ కిషోర్ ను పరిచయం కూడా చేశారు జగన్.. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు వైసీపీకి మంచి ప్లస్ అయ్యాయి.


2019 ఎన్నికల్లో పీకే వ్యూహాలు కలిసి వచ్చి.. వైసీపీ 151 అసెంబ్లీ, 22 లోక్ సభ సీట్లను సొంతం చేసుకుంది.. ఆ ఘన విజయానికి తన పాదయాత్ర, పీకే టీమ్ కృషే కారణమని జగన్ సైతం వెల్లడించారు. అయితే ఆ తర్వాత ఐ ప్యాక్ కు, జగన్ కు ప్రశాంత్ కిషోర్ దూరమయ్యారు. ఆ తర్వాత ఐ ప్యాక్ టీంకు అప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ దగ్గరే ఉన్న రిషిరాజ్ సింగ్ సారథ్య భాద్యతలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించినా జగన్ ఐ ప్యాక్ వ్యూహాలతోనే పాలన చేశారంటారు. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ సారధ్యంలోనే పనిచేసిన రాబిన్ శర్మ గత ఎన్నికల్లో టీడీపీ వ్యూహకర్తగా పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ సైతం ఎన్నికల సమయంలో టీడీపీకి ప్రత్యక్షంగా పనిచేయకపోయినా తెర వెనుక మంత్రాంగం జరిపారన్న అభిప్రాయం ఉంది .. మొత్తం మీద 2024 ఎన్నికల్లో రాబిన్ శర్మ షో టైమ్ వ్యూహాలు సక్సెస్ అయ్యాయి.. ఐ ప్యాక్ వ్యూహాలు ఫెయిలయ్యాయి.

కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడంతో ఇక ఐ ప్యాక్.. దుకాణం బందే అని అందరూ భావించారు. కానీ సంస్థ అనూహ్యంగా రంగం లోకి దిగి పని ప్రారంభించడం వైసీపీ క్యాడర్‌కు మింగుడు పడటం లేదంట. వైసీపీ లోకి ఐ ప్యాక్ రీ ఎంట్రీపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికలకు ముందు ఆ బృందం పరిధికి మించి పార్టీ వ్యవహారాలలోకి జోక్యం చేసుకుందనేది ఆ పార్టీ నేతల కంప్లైంట్.. పార్టీలో తలలు పండిన సీనియర్ నాయకులను సైతం ఆ పార్టీ వ్యూహకర్తలు కొందరు తమదైన శైలిలో పని చేసుకోనీయ లేదన్న విమర్శలున్నాయి. అనేక సార్లు ఓటమి లేకుండా గెలుస్తూ వచ్చిన తమలాంటి వారిని సైతం ప్రత్యక్ష రాజకీయాలను తొలిసారే చూస్తున్న ఆ బృందం సభ్యులు లెక్కచేయలేదనేది వైసీపీలోని సీనియర్లు ఆరోపిస్తున్నారు.

Also Read: రోజాకు జగన్ రాంరాం.. రంగం లోకి కొత్త లీడర్

ఎన్నికల సమయంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలను ఐ ప్యాక్ సభ్యులు అది చేయండి, ఇది చేయండి అని ఆదేశాలు జారీ చేశారంట. నియోజకవర్గాల వారీగా సమాచారం ఇస్తూ ఇలా చేయండి, ప్రలోభాలకు గురిచేయాలని, ఏ నియోజకవర్గం అయినా సరే ప్రలోభాల గురించి దృష్టిసారించాలని ఆదేశించారంట. ఖరీదైన కానుకలు ఇచ్చి వాలంటీర్లను చెప్పు చేతల్లో ఉంచుకోవాలని, నియోజకవర్గాల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తే వ్యతిరేకతను తప్పించుకోచ్చని సూచించారంట. నియోజకవర్గంలో ఓటర్లు, సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంత డబ్బు పంచాలో లెక్కలు వేసి వివరించారంట. ఇలా వారు అన్నింటి గురించి తమకు చెప్పడం ఏంటని అప్పట్లోనే ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. హై కమాండ్ పేరు చెప్పి తమను బెదిరిస్తున్నారని మరికొందరు వాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కొందరు ఐ ప్యాక్ టీం సభ్యులు సొంత పార్టీ లోని లీడర్లతో పాటు ప్రత్యర్థి పార్టీల నేతలతో సైతం లోపాయికారి ఒప్పందాలు చేసుకుని పార్టీ అధిష్టానానికి తప్పుడు నివేదికలు పంపారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎన్నికల కోసం ఐ ప్యాక్ టీమ్‌లో నైపుణ్యం లేని వ్యక్తులను సైతం అప్పటికప్పుడు రిక్రూట్ చేసుకోవటం వల్లే కొన్ని తప్పులు జరిగాయనేది కాదనలేని వాస్తవం.. అయితే ఐ ప్యాక్ వ్యూహాలు ఎన్నికల్లో విజయాన్ని అందించకపోయినా ఆ పార్టీ ఎన్నికలకు ముందు జగన్ తో ఎన్నికల ప్రచారం కోసం నిర్వహింప చేసిన సిద్ధం సభలు.. బస్సు యాత్ర ప్రోగ్రామ్స్ మాత్రం భారీగానే సక్సెస్ అయ్యాయి..

గత ఎన్నికల్లో పరాజయానికి ఒక్క ఐ ప్యాక్ దే బాధ్యత కాకపోయినా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా వైసీపీ ఓటమికి కూడా రకరకాల కారణాలు కనిపిస్తాయి. అందులో ఐ ప్యాక్ టీమ్ అభ్యర్ధుల మార్పులు చేర్పులపై ఇచ్చిన సర్వే నివేదికలు కూడా ప్రధాన కారణమని వైసీపీ వర్గాలే ఆరోపిస్తుంటాయి. అయినా జగన్ వారిని మరోసారి నమ్మారంటే దానికి బలమైన కారణాలే ఉంటాయని పార్టీ వర్గాల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎవరినైనా నమ్మితే వారికోసం ఎంత వరకైనా వెళ్ళటం. ఏమైనా చేయటమనేది.. జగన్ బలం.. బలహీనత అని ఆయనను దగ్గరి నుంచి చూసిన వారు చెప్తుంటారు. ఇప్పుడు కూడా వారితో ఏర్పడిన మైత్రి కారణంగానే మరోసారి ఆయన అవకాశం ఇచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.

మరి ఈసారి వారి పరిధిని పరిమితం చేస్తారా.. వారిని ఏ మేరకు ఉపయోగించుకుంటారు. ఐ ప్యాక్ వైసీపీని అధికారం లోకి తీసుకు రావటంలో ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.. అయితే ఐపాక్ టీమ్ రీ ఎంట్రీ పై వైసీపీ వర్గాల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వచ్చే ఎన్నికలలో గెలుపుపై అప్పుడే నీలినీడలు కమ్ముకున్నాయని వారంతా ఆందోళన చెందుతున్నారంట. మరి జగన్ లెక్కలేంటో? ఈ సారి ఐ ప్యాక్ టీమ్ స్ట్రాటజీలు ఎలా ఉంటాయో చూడాలి.

 

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×