Ram Charan about Sai tej : మెగా ఫ్యామిలీలో ఉన్న యంగ్ హీరోస్ లో సాయి తేజ్ ఒకరు. రేయ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి తేజ్. రవి చౌదరి దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ సినిమా మీద అప్పట్లో విపరీతమైన అంచనాలు ఉండేవి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి గాని సినిమా ఫలితం మాత్రం తేడా కొట్టింది. ఆ తర్వాత దిల్ రాజు నిర్మించిన పిల్లా నువ్వు లేని జీవితం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమా సాయి తేజ కెరియర్ కి మంచి ప్లస్ అయింది.
సాయి తేజ్ వరుస సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. అయితే సాయి తేజ్ కెరియర్ లో హిట్ సినిమాలు కన్నా ప్లాప్ సినిమాలు ఎక్కువ ఉన్నాయి. ఒక సందర్భంలో సాయి తేజ్ గురించి చాలామంది మాట్లాడుతూ స్టోరీ సెలక్షన్స్ లో చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ ను మించిపోయాడు అంటూ కామెంట్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. జానీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కి వరుస డిజాస్టర్ సినిమాలు పడ్డాయి. అలానే సాయి తేజ్ కూడా వరుస డిజాస్టర్లు పడడంతో ఈ కామెంట్స్ ఎదుర్కొన్నాడు. సాయి తేజ్ సినిమాలు ప్లాప్ అయినా కూడా ఇప్పటికీ మంచి ఓపెనింగ్స్ వస్తాయి అంటే కారణం సాయి తేజ్ రియల్ క్యారెక్టర్. కొన్ని సందర్భాలలో సాయి తేజ్ మాట్లాడిన విధానం కూడా చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది.
Also Read : Sambarala Yeti Gattu: మెగా మేనల్లుడు అనుకున్న టైటిల్ తోనే వచ్చేస్తున్నాడు
ఇక సాయి తేజ్ కెరియర్ ఎవరు మర్చిపోలేని విషాదం అంటే సాయితేజ్ యాక్సిడెంట్. దాదాపు చావు అంచుల వరకు వెళ్లి వచ్చేసాడు. ఆ తర్వాత విరూపాక్ష లాంటి పాన్ ఇండియా సినిమా చేసి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు సంబరాల ఏటిగట్టు అని మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన లాంచ్ ఈవెంట్ ను ఈరోజు నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ ఎమోషనల్ కు గురి అయ్యారు. సాయితేజ్ ను ఉద్దేశిస్తూ ఇది వాడికి పునర్జన్మ. ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెబుతున్నాను. వీడు ఇక్కడ నిలబడ్డాడు అంటే దానికి కారణం మీరు మీ బ్లెస్సింగ్స్. కేవలం మీ బ్లెస్సింగ్స్ మాత్రమే వీడికి పునర్జన్మ ఇచ్చాయి. మీరు కేవలం ఫ్యాన్స్ కాదు గోల్డెన్ ఫాన్స్ అంటూ రామ్ చరణ్ మాట్లాడారు.
Also Read : Ram Charan: రామ్ చరణ్ కూతురును చూశారా.. అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందో కదా