Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్.. కాంట్రవర్సీలకు పెట్టింది పేరు.. ఏదైనా ఒక విషయంపై స్పందించారు అంటే ఎంతటి వారైనా సరే సైలెంట్ అయిపోవాల్సిందే. అంతలా అటు సోషల్ మీడియా ద్వారా కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ.. ఎప్పటికప్పుడు తన మార్క్ చూపించుకుంటున్నారు వర్మ. అలా ఒకప్పుడు పులిలా విజృంభించిన వర్మ.. ఇప్పుడు పిల్లిలా మారిపోవడం చూసి పవన్ కళ్యాణ్ మరీ ఇంతలా భయపెట్టారా..? ఏం అడిగినా తెలియదు.. చూడలేదు.. ఫాలో కాలేదు.. అని చెప్తున్నాడు ఏంటి? అంటూ వర్మ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి పులిలా ఉన్న వర్మను పిల్లిలా పవన్ కళ్యాణ్ ఎందుకు మార్చాడు? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
పవన్ కళ్యాణ్ దెబ్బకు సైలెంట్ అయిన వర్మ..
గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. వైసీపీ పార్టీకి ఫేవర్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu), డీసీఎమ్ పవన్ కళ్యాణ్(DCM Pawan Kalyan), విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ..వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసింది. అయితే ఈ ఫోటోలను ఈయన రీ క్రియేట్ చేయకపోయినా.. ఎవరో చేసిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో మండిపడ్డ వారు ఇప్పుడు రివేంజ్ తీర్చుకుంటున్నారనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇదే కేసు పై పలుమార్లు రాంగోపాల్ వర్మకు నోటీసులు అందుతున్న విషయం తెలిసిందే. ఇక మరొకవైపు ఇదే విషయంపై అటు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) కూడా అరెస్ట్ అయిన విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక పోసాని అరెస్టు విషయంపై అందరూ పలు రకాలుగా స్పందిస్తూ ఉండగా ఇదే విషయాన్ని రాంగోపాల్ వర్మ దగ్గర ప్రశ్నించగా ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.
ALSO READ:Raja Saab Movie: నవ్వి నవ్వి సచ్చిపోవాలే.. రాజాసాబ్ స్టోరీ చెప్పిన కమెడియన్ సప్తగిరి..!
పులిలా ఉండేవాడు.. పాపం పిల్లిలా మారిపోయాడేంటి?
పోసాని అరెస్టుపై మీరేమనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. “అసలు ఆ విషయమే నాకు తెలియదు. నేను దాన్ని ఫాలో కాలేదు. ప్రస్తుతం నా సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాను. పైగా ఎవరు అరెస్టు అవుతున్నారు అనే విషయాన్ని నేను తెలుసుకోవడం లేదు. ప్రత్యేకించి పొలిటికల్ విషయాలను నేను ఫాలో అవడం లేదు” అంటూ తెలిపారు.
కనీసం ఆంధ్రప్రదేశ్ లో పాలన ఎలా ఉంది? అనే విషయం పైన అయినా స్పందించండి అని ప్రశ్నించగా..” నాకు తెలియదు. నేను ఎవరి గురించి పట్టించుకోను” అంటూ వర్మ తెలిపారు.
పోసాని కూడా గతంలో వేటి గురించి నేను మాట్లాడను.. రాజకీయాల నుంచి పక్కకు వస్తున్నాను అని అన్నారు.. కానీ ఒక రోజు ఆయనను పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఇక మీరూ అలాగే అంటున్నారు అని ప్రశ్నిస్తూ ఉండగానే..” ఇక నేను రాజకీయాల గురించి మాట్లాడను” అంటూ తెలిపారు వర్మ.
గతంలో రాజకీయాల గురించి సినిమాలు తీసినప్పుడు ఎవరికి నష్టం కలిగింది? ఎవరికి లాభం కలిగింది? అని యాంకర్ ప్రశ్నిస్తూ ఉండగానే.. ” రాజకీయాల గురించి నేను మాట్లాడను.. నన్నేమీ అడగకండి”.. అంటూ పదేపదే వర్మ చెప్పడంతో నెటిజన్స్ కూడా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే రాజకీయాల గురించి మాట్లాడాలంటేనే వర్మ భయపడిపోతున్నాడు. వర్మకి టన్నుల్లో భయం పుట్టించాడు పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటూ నెటిజన్స్ కూడా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పులిలా ఉండే వర్మ.. మరీ పిల్లిలా మారిపోయారేంటి అంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.