Ram Gopal Varma : కాంట్రవర్సిటీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). ఆయన గురించి మూవీ లవర్స్ కి స్పెషల్ గా పరిచయం అక్కర్లేదు. తరచుగా సోషల్ మీడియాలో ఏదో ఒక కాంట్రవర్సీతో ఆయన ట్రెండ్ అవుతూనే ఉంటారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ (Amma Rajyam lo Kadapa Redlu) సినిమాకి సంబంధించిన కేసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతలోనే రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా ఉమెన్స్ డే సందర్భంగా ఓ కాంట్రవర్సీ పోస్ట్ చేసి, మళ్లీ వార్తల్లో నిలిచారు. మరి రామ్ గోపాల్ వర్మ అమ్మాయిలపై చేసిన ఆ పోస్ట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…
మహిళలపై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద కామెంట్స్
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ స్పెషల్ గా ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అందరూ మహిళా సాధికారత, మహిళల గొప్పతనం గురించి ట్వీట్లు పెడుతున్నారు. కానీ ఆర్జీవి అందరి కంటే చాలా డిఫరెంట్ కదా. అందుకే ఆయన అందరిలా కాకుండా అమ్మాయిల గురించి డీఫరెంట్ గా, వివాదాస్పద పోస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా రామ్ గోపాల్ వర్మ “నా ఉనికి లేకుండా నేను జీవించగలనేమో కానీ, స్త్రీల ఉనికి లేకుండా మాత్రం జీవించలేను… ఉమెన్స్ డే శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఉమెన్స్ డే రోజున ఇలాంటి పోస్ట్ చేస్తారా? అంటూ నెటిజన్లు వర్మపై ఫైర్ అవుతున్నారు.
రిలీజ్ కు సిద్ధం అవుతున్న ‘శారీ’
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్లో ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ శర్మ ‘శారీ’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తుండగా, సత్యా యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. మార్చ్ 21న ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
ఇక మరోవైపు రామ్ గోపాల్ వర్మ వరుసగా వివాదాలను ఎదుర్కొంటున్నారు. ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాకు సంబంధించిన కేసులో ఒంగోలు, మంగళగిరి, అనకాపల్లిలో ఫిర్యాదులు నమోదు కాగా, సీఐడీ పోలీసులు ఆర్జీవికి నోటీసులు అందజేశారు. మరోవైపు 2018లో రామ్ గోపాల్ వర్మ సంస్థ జారీ చేసిన చెక్ బౌన్స్ అయిందని ఆరోపిస్తూ ఓ కంపెనీ కంప్లైంట్ చేసింది. జనవరి 21న అంధేరిలోని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్, వైపి పూజారి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం వర్మను దోషిగా నిర్ధారించి, ఆయనకు మూడు నెలల జైలు శిక్షను విధించింది. అంతేకాకుండా మూడు నెలల్లోగా కంప్లైంట్ చేసిన వ్యక్తికి రూ. 3,72,2019 రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును వర్మ సెషన్ సెషన్స్ కోర్టులో సవాలు చేయగా, మార్చి 4న ఆయన అప్పీల్ ని తోసుకొచ్చింది. ఒకవేళ కావాలనుకుంటే వర్మ కోర్టు ముందు హాజరై, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
I can live without my existence , but i can’t live without women’s existence ..HAPPY WOMEN’S DAY🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) March 8, 2025