కేంద్రం దగ్గర అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, నిధులపై రాష్ట్రం తరఫున పార్లమెంటులో పోరాడేలా ఒక కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేయాలన్న ఉద్దేశంతో.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నమిది.
మరి కాసేపట్లో ప్రారంభం కానున్న.. ఈ అఖిల పక్ష సమావేశానికి.. బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారా లేదా? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 17 మంది ఎంపీలుండగా.. కాంగ్రెస్, బీజేపీ చెరో 8 మంది ఎంపీలు, ఎంఐఎం ఒక్క ఎంపీగా ఉన్నారు. మరి ఈ భేటీ కి హాజరు గైర్హాజరు ద్వారా బీజేపీ ఎలాంటి స్టాండ్ తీస్కోనుంది? తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంకేతాలను పంపనుందన్న చర్చ కొనసాగుతోంది.
Also Read: ప్రజాభవన్‌లో ఇవాళ ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్
ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేకపోవడంపై.. డిప్యూటీ సీఎం భట్టికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. మీటింగ్‌కు ఆహ్వానించినందుకు ధన్యావాదాలు తెలిపారు. అయితే, ఆహ్వానం ఆలస్యంగా అందటం వల్ల తమ పార్టీలో అంతర్గతంగా చర్చించుకునే సమయం లేదని, అలాగే ఇప్పటికే ఖరారైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి.. అఖిలపక్ష సమావేశానికి రాలేకపోతున్నామని కిషన్‌రెడ్డి లేఖలో తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలనుకుంటే కాస్త ముందుగానే తెలియజేయాలని కోరారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి BJP కట్టుబడి ఉందని, రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తూనే ఉంటామని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.