Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఈ వయసులో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటూ వరుస చిత్రాలతో యంగ్ హీరోలను సైతం ఆశ్చర్యపరుస్తూ.. బిజీగా మారిపోయారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిరంజీవి, ఆ తర్వాత హీరోగా మారి తన స్టామినా ఏంటో నిరూపించారు. సుప్రీం హీరోగా , మెగాస్టార్ గా నేడు చలామణి అవుతున్న ఈయన.. ఇటు సినిమాలలోనే కాదు అటు సేవా కార్యక్రమాలతో కూడా అందరికీ చేరువవుతున్నారు. ఇకపోతే మెగాస్టార్ ఈమధ్య ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా కష్టపడుతున్నారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన పుట్టుకతోనే కష్టపడేతత్వం కలిగి ఉన్నారు అంటూ తాజాగా ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు నాగబాబు (Nagababu) కామెంట్లు చేశారు.
Mahesh Babu – Namrata: బంధంలో బీటలు.. నిజం ఒప్పుకున్న నమ్రత..!
పుట్టుకతోనే అన్నయ్య కష్టజీవి – నాగబాబు
తాజాగా ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు కుటుంబంతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు నాగబాబు. అందులో నాగబాబు చిరంజీవితో పాటు వారి సోదరీమణులు, తల్లి అంజనాదేవి (Anjana Devi) కూడా ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగానే నాగబాబు తన అన్నయ్య గురించి మాట్లాడుతూ..” అన్నయ్య గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువే. సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్లుగా పుడితే, వారికి ఏ పనులు ఉండవని, తర్వాత పుట్టే పిల్లలతోనే వారు అన్ని పనులు చేయిస్తారని, పైగా కాస్త మందబుద్ధిగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ వాటన్నింటికీ అన్నయ్య పూర్తిగా విరుద్ధం. ఇంట్లో అమ్మానాన్న ఏం చెప్పినా సరే అన్నయ్య వినేవాడు. ఎంత కష్టమైనా చేసేవారు. ఆఖరికి మాకు చెప్పిన పనులను కూడా అన్నయ్య చేసేవారు . అయినా సరే ఒక్కొక్కసారి నాన్న చేతిలో దెబ్బలు కూడా అన్నయ్యకే పడేవి. అప్పుడు అమ్మ కూడా ఏమీ అనేవారు కాదు. దాంతో మాకే నాన్న మీద కోపం వచ్చేది. అంత కష్టపడినా కూడా అన్నయ్యనే నాన్న కొట్టేవాడేంటి అంటూ కోప్పడే వాళ్ళం. అయినా సరే ఏం చేయలేక వెళ్లిపోయే వాళ్ళం “అంటూ నాగబాబు తన అన్నయ్య గురించి చెప్పుకొచ్చారు. అంతేకాదు తన అన్నయ్య చాలా హైపర్ ఆక్టివ్ అంటూ చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపించారు నాగబాబు. మొత్తానికైతే ఈ మాటలు విన్న తర్వాత చిరంజీవి పుట్టుకతోనే కష్టజీవి, అందుకే నేడు లక్షలాది మంది అభిమానుల హృదయాలను సొంతం చేసుకున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
చిరంజీవి సినిమాలు..
ఇక చిరంజీవి విషయానికి వస్తే.. ఏడుపదుల వయసుకు చేరువలో ఉన్నా.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. అందులో భాగంగానే ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vassista Mallidi) దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మే నెలలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకవైపు అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి సినిమా కోసం మూడు నెలల సమయాన్ని కేటాయించిన చిరంజీవి.. ఆలోపు సినిమాను పూర్తి చేసి, వచ్చేది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు. మొత్తానికి అయితే చిరంజీవి నాటి నుండి నేటికీ కష్టపడుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని చెప్పవచ్చు.