BigTV English

Ram Gopal Varma: వర్మ కంట్లో పడ్డ మరో అమ్మాయి.. ఎవరో తెలిస్తే షాక్..!

Ram Gopal Varma: వర్మ కంట్లో పడ్డ మరో అమ్మాయి.. ఎవరో తెలిస్తే షాక్..!

Ram Gopal Varma..సాధారణంగా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కంట్లో ఎవరైనా అమ్మాయి పడింది అంటే.. కచ్చితంగా ఆ అమ్మాయి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు.. ముఖ్యంగా ఆయన తలుచుకుంటే మారుమూల గ్రామంలో ఉన్న అమ్మాయికైనా సరే స్టార్ హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు అందిస్తారు. అందుకే వర్మ దృష్టిలో పడాలని ఎంతోమంది అమ్మాయిలు తెగ ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వర్మ కంట్లో పడడానికి అమ్మాయిలే కాదు ట్రాన్స్ జెండర్లు కూడా తెగ తాపత్రయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


శారీ ప్రమోషన్స్ లో ట్రాన్స్ జెండర్ తో వర్మ ముచ్చట్లు..

రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం శారీ.. ఈ సినిమా ఏప్రిల్ 4వ తేదీన విడుదల కాబోతోంది. ఆరాధ్య దేవి లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం నుండి ట్రైలర్ సాంగ్స్ ఇప్పటికే భారీ ట్రెండ్ అయ్యాయి. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వర్మ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంతో అందరినీ సర్ప్రైజ్ చేస్తారంటూ వర్మ ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడిపేస్తున్నారు వర్మ. అందులో భాగంగానే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ , యూట్యూబర్స్ తో పాటు మీడియాతో కూడా ముచ్చట్లు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక ట్రాన్స్ జెండర్ తో వర్మ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ముఖ్యంగా వర్మను ఇరుకునపెట్టి మొత్తానికి ఒక సినిమా అయితే కమిట్ అయ్యేలా చేసింది.


త్వరలో వారితో మూవీ..

ఆ వీడియోలో వీరిద్దరి సంభాషణ విషయానికి వస్తే.. “వర్మ చేతిలో పడ్డ మీ స్నేహ.. నా లుక్ ఎలా ఉందో చెప్పండి ” అంటూ ఆర్జీవిని అడిగింది ట్రాన్స్ జెండర్ స్నేహ. “శారీలో ఉన్నారు కదా చాలా బాగున్నారు.. ఇప్పుడంతా శారీ మూడ్ లో ఉన్నాము” అంటూ వర్మ చెప్పారు. దీంతో స్నేహ “లవ్ యు సార్.. మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా” అని అడగగా హగ్ కూడా ఇచ్చారు వర్మ. ఇక తర్వాత ట్రాన్స్ జెండర్ స్నేహ మాట్లాడుతూ..” మీరంటే నాకు అస్సలు నచ్చదు” అని చెప్పగానే అంతలోపే వర్మ..”కానీ మీరు నాకు నచ్చారు” అంటూ సమాధానం ఇచ్చారు. “నేను మీ మీదకి కోపంతో వచ్చాను. ఎంతసేపూ అమ్మాయిలనే పొగుడుతూ.. వారి స్ట్రక్చర్, బాడీ గురించి చెబుతారు. ఒక ట్రాన్స్ జెండర్ గా వింటే నాకు కూడా కోపం వస్తుంది. మరి మా మీద మీరు ఎప్పుడు సినిమా తీస్తారా అని మేము కూడా ఎదురు చూస్తున్నాము” అంటూ అడగగా.. వర్మ ఊహించిన సమాధానం చెప్పారు. “ఎప్పుడైనా తీయోచ్చేమో” అంటూ వర్మ ఓపెన్ గానే చెప్పడంతో ఇక అందరూ త్వరలో ట్రాన్స్ జెండర్ తో వర్మ సినిమా తెరకెక్కించబోతున్నారు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. “మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. కానీ మీరు నాకు దొరికిపోయారు” అంటూ స్నేహ తెలిపింది. ఇక మొత్తానికైతే ట్రాన్స్ జెండర్ స్నేహ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×