BigTV English

Illu Illalu Pillalu Today Episode: భాగ్యంకు దిమ్మతిరిగే షాకిచ్చిన చందు.. కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా..

Illu Illalu Pillalu Today Episode: భాగ్యంకు దిమ్మతిరిగే షాకిచ్చిన చందు.. కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా..

Illu Illalu Pillalu Today Episode April 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి నువ్వు నాకు సాయం చేయాలి నేను ఏ తప్పులు చేయకుండా నన్ను కట్టడి చేయాలి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. ధీరజ్ సంతోషంలో ప్రేమని హగ్ చేసుకుంటాడు. తన భర్త సంతోషం కోసం ప్రేమ ఏదైనా చేస్తుందని అర్థమవుతుంది. మొత్తానికి ధీరజ్ ప్రేమల మధ్య ప్రేమ పుడుతుంది.  అందరు సంతోషంగా సందడి చేస్తూ పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. అలాగే అటు భాగ్యముల ఫ్యామిలీ కూడా పెళ్లికూతురు చేత అమ్మవారికి పొంగళ్ళు పెడతారు. పెళ్లి పనులు అయితే మొదలు పెట్టేసాం పెళ్లి ఎలా చేయాలి అని భాగ్యమలు ఆలోచిస్తారు అయితే.. మన అల్లుడు గారే ఈ పెళ్లిని దగ్గరుండి చేసేలా చేయాలని భాగ్యం అంటుంది. ఇంట్లో చందు పెళ్లి పనులను మొదలు పెడతారు.. రామ రాజు పెళ్లి పత్రికలు తీసుకువచ్చి ఇస్తారు. శ్రీవల్లి చందు కు ఫోన్ చేస్తుంది. సీక్రెట్ గా కలవాలని అనగానే వస్తానని చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు. భాగ్యం ఈ పెళ్లిని ఎలా చేయాలని ఆనందరావు ఆలోచిస్తూ ఉంటే మీరంతా కూల్ గా ఉండండి నేను సెట్ చేసేస్తాను కదా అనేసి అంటుంది . శ్రీవల్లిని చందు కి ఫోన్ చేసి రమ్మని అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్తుంది. చందుకు ఫోన్ చేసి మాట్లాడాలి అర్జెంటుగా మా ఇంటికి రండి అని పిలుస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి పత్రికను చూసుకుంటూ సంతోషంగా ఉంటారు..

అందరూ పెళ్లి పత్రికను గురించి చూసి మురిసిపోతుంటే చందు మాత్రం అక్కడి నుంచి మెల్లగా జారుకుంటారు. చూసిన ధీరజ్ సాగర్ ఎక్కడికెళ్తున్నావ్ రా.. పెళ్లి కొడుకు అసలే బయటికి వెళ్లకూడదు. మేము కూడా నీతో పాటు వస్తామంటే చిన్న పని ఇప్పుడే వస్తానని చందు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. మీ వదిన అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది అందుకే వెళ్తున్నా అనేసి అంటాడు. కానీ మేము వస్తాము అని అంటారు. అందరు కలిసి శ్రీవల్లి ఇంటికి వెళ్ళిపోతారు.


భాగ్యం వాళ్ళ ముగ్గురు రావడం చూసి షాక్ అవుతారు. ఒక్కడినే రావాలని అంటే ముగ్గురు వచ్చారేంటి అని లోపలికి రాగానే చూసి షాక్ అవుతారు. సాగర్ ఆనందం పై సెటైర్స్ వేస్తాడు. ఇక భాగ్యంపై కూడా సేటర్ల మీద సెటిల్ వేస్తారు. ఇకనుంచి ఎలాగైనా పంపించాలని భాగ్యం ప్లాన్ వేస్తుంది. ఎవరింటికైనా వచ్చినప్పుడు పూలు పనులు తీసుకెళ్లడం మన సాంప్రదాయం మీ వాళ్ళు నేర్పించలేదా అని అడుగుతుంది.

మేము ఏదో అర్జెంటుగా మాట్లాడాలి అంటే వచ్చాము. అందుకే ఏం తీసుకురాలేదు అంటే తీసుకురాకపోతే ఎట్లా అనేసి వాళ్ళు కావాలని అంటారు. ధీరజ్ సాగర్ ఇద్దరూ స్వీట్లు కొనడానికి బయటకు వెళ్తారు.. ఇంకా అదే అధునిక చూసుకుని భాగ్యం శ్రీవల్లిని ప్లాన్ వర్క్ చేయమని.. శ్రీవల్లి కూడా ఆప్షన్ అన్న చందుని ఎలాగైనా ట్రాప్ చేసి డబ్బులు కావాలని అడుగుతుంది.

ప్రేమ నర్మదా ఇద్దరు మాట్లాడుకుంటారు. నర్మదా ఏదో దాస్తుందని ప్రేమ అడుగుతుంది. పెళ్లి పత్రిక పై సాగర్ నర్మదా పేర్లు ఉండటం చూసి ప్రేమ మీ పేరు రాశారు ఏంటక్కా అని అడుగుతుంది. మా అమ్మానాన్నలు నాతోపాటు ఉంటే ఎంత బాగుండేది అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మాత్రమే అనుకున్నాను కానీ కుటుంబ సభ్యుల మధ్య జరిగే అత్యంత గొప్ప వేడుకని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని బాధపడుతుంది.

మనిద్దరికీ ఆ ముచ్చట తీరలేదు కదా. మనం ఇంట్లో వాళ్లకి సంబంధం లేకుండా పెళ్లి చేసుకొని వచ్చాము కానీ వాళ్ళు మనల్ని ఎప్పటికీ దగ్గరకు రానివ్వరేమో అని నర్మదా బాధపడుతుంది. ప్రేమ కూడా తన పుట్టింటి వాళ్ళని తలుచుకొని బాధపడుతుంది. వీళ్ళిద్దరిలా మాట్లాడుకోవడం వేదవతి వింటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో శ్రీవల్లికి చందు డబ్బులు ఇస్తాడా? లేదా? అన్నది చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×