BigTV English
Advertisement

Ram Gopal Varma: నేను ప్రమోట్ చేసే ప్రొడక్ట్ ఇదే.. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్‌పై వర్మ రియాక్షన్

Ram Gopal Varma: నేను ప్రమోట్ చేసే ప్రొడక్ట్ ఇదే.. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్‌పై వర్మ రియాక్షన్

Ram Gopal Varma: ప్రస్తుతం సోషల్ మీడియాలో, వార్తల్లో ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు అంతా ప్రస్తుతం చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ఆ లిస్ట్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇక వారు, వీరు అని తేడా లేకుండా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, రమ్మీని ప్రమోట్ చేసినందుకు అందరిపై సమానంగా యాక్షన్ తీసుకోవాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. ఇక ఈ సమయంలో ఈ వైరల్ అవుతున్న టాపిక్‌పై తన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.


తెలుసుకోవడం కష్టం

బెట్టింగ్ యాప్స్‌పై రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం ఏంటని అడగగా.. ‘‘నేను దానికి వ్యతిరేకం. ఈ గేమ్స్, యాప్స్ అనేవి మంచివి కాదు అనే చెప్తాను. కాకపోతే అవి ప్రమోట్ చేయమని అడిగినప్పుడు ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోవడం కష్టం. బాలీవుడ్‌లో చాలామంది ఇలాగే గుట్కా యాడ్స్ చేశారు’’ అంటూ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారిని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడాడు రామ్ గోపాల్ వర్మ. చాలావరకు ప్రేక్షకులు కూడా వర్మ కామెంట్స్ కరెక్ట్ అని ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న వారిదే తప్పు అని, తెలిసీ తెలియక వాటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలది ఎలాంటి తప్పు లేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


అది రికమెండ్ చేయను

సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ మాత్రమే కాదు.. ఎన్నో ప్రొడక్ట్స్‌ను, బ్రాండ్స్‌ను కూడా ప్రమోట్ చేస్తుంటారు. అలాంటి అవకాశమే తనకు వస్తే తను దేనిని ప్రమోట్ చేస్తారు అనే ప్రశ్న రామ్ గోపాల్ వర్మకు ఎదురయ్యింది. అయితే తాను ఎప్పటికీ వోడ్కానే ప్రమోట్ చేస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు వర్మ. టీ తాగమని మాత్రం ఎప్పటికీ రికమెండ్ చేయను అని చెప్పేశాడు. అసలు వోడ్కా అంటే రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరోయిన్స్‌తో కలిసి వోడ్కా పార్టీ చేసుకుంటున్న ఫోటోలు, వీడియోలు తరచుగా ఆయన సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. అవి వెంటనే వైరల్ కూడా అవుతుంటాయి.

Also Read: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను.. కానీ నా తప్పు లేదు.. రౌడీ హీరో స్టెట్‌మెంట్ ఇదే..

శిక్ష తప్పదు

ప్రస్తుతం ప్రకాశ్ రాజ్, రానా, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ లాంటి సినీ సెలబ్రిటీలు సైతం ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో నిందితులుగా నిలిచారు. ఇక సినీ సెలబ్రిటీల విషయం పక్కన పెడితే దాదాపు 10 మందికి పైగా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ కేసులో నిందితులుగా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పిలిచి మరీ విచారణ జరిపించారు పోలీసులు. అందులో చాలామంది తెలియక వాటిని ప్రమోట్ చేశామని తప్పు ఒప్పుకున్నారు. తెలిసి చేసినా, తెలియక చేసినా శిక్ష తప్పదు అన్నట్టుగా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్, సినీ సెలబ్రిటీలపై సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×