World Oral Health Day: మంచి చిరునవ్వు ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది మీ అందాన్నిపెంచడానికి ఉపయోగపడటమే కాకుండా మీ ఆరోగ్యానికి అద్దంగా కూడా పని చేస్తుంది. ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 20 న జరుపుకుంటారు. ఈ రోజుల్లో తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా నోటి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రతి ఒక్కరూ తమ పళ్లను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలని, ఆరోగ్యకరమైన చిరునవ్వును కాపాడుకోవాలని వరల్డ్ ఓరల్ డే నిర్వహిస్తున్నారు.
సరైన ఆహారం తినడంతో పాటు మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకోవడం వల్ల మీరు మీ దంతాలను బలంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కానీ పళ్లకు హాని కలిగించే ఆహార పదార్థాలు కూడా చాలానే ఉన్నాయి. వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రపంచ నోటి దినోత్సవం సందర్భంగా మీరు ఎలాంటి పళ్ల ఆరోగ్యం కోసం మీరు ఎలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువ తీపి, జిగట ఉన్న పదార్థాలు:
మన నవ్వుతున్న ముఖ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పసుపు రంగులోకి మారిన పండ్లు మాత్రం అసౌకర్యంగా అనిపిస్తాయి. అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకుండా ఉండాలి. అందులో ముఖ్యమైనవి చాక్లెట్లు, స్వీట్లు. కూల్ డ్రింక్స్ . వీటిలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది దంతాల్లో ఉండే బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. ఫలితంగా ఇది దంత క్షయానికి కారణం అవుతుంది. ముఖ్యంగా జిగురుగా ఉండే స్వీట్లు దంతాలపై ఎక్కువగా అంటుకుని ఉంటాయి. దీని వల్ల పళ్లు త్వరగా పాడవుతాయి.
పొగాకు, సిగరెట్ :
సిగరెట్లు, పొగాకు.. పళ్లు పసుపు రంగులోకి మారడానికి కారణం అవుతాయి. అంతే కాకుండా ఇవి చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. పళ్ల జలదరింపులతో పాటు, పుచ్చిపోయేలా చేస్తాయి. నోటి క్యాన్సర్ కు కూడా కారణం అవుతాయి. ఆరోగ్యకరమైన పళ్ల కోసం వీటిని తినడం మానేయండి.
కార్భోనేటెడ్ డ్రింక్స్ :
కూల్ డ్రింక్స్ , సోడాతో పాటు ఎక్కువగా పుల్లగా ఉండే పండ్ల రసాలు తాగడం వల్ల కూడా పళ్లపై ఉండే ఎనామెల్ దెబ్బతింటుంది. అంతే కాకుండా పళ్లు కూడా బలహీనంగా మారతాయి. దీని వల్ల పళ్లు త్వరగా అరిగిపోతాయి. సున్నితంగా మారతాయి.
వేడిగా, చల్లగా ఉండే ఆహారాలు:
చాలా వేడి టీ-కాఫీ లేదా ఐస్ ఉన్న డ్రింక్స్ పళ్ల సున్నితత్వాన్ని పెంచుతాయి. దీనివల్ల దంతాలలో జలదరింపు , నొప్పి వంటివి వస్తాయి. అందుకే చాలా వేడిగా, చల్లగా పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి.
బ్రష్ సరిగ్గా చేయకపోవడం:
మీరు సరిగ్గా బ్రష్ చేయకపోతే , ఫ్లాస్ చేయకపోతే మీ దంతాలపై ఫలకం పేరుకుపోతుంది. ఇది కావిటీస్ , చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది. అందుకే రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోండి. అంతే కాకుండా ఫ్లాసింగ్ అలవాటు చేసుకోండి.
Also Read: జుట్టు పలచబడిందా ? అయితే ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి
పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ?
1. రోజుకు రెండుసార్లు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయండి.
2. మీ పళ్ల మధ్య ఇరుక్కుపోయిన ఆహార కణాలను తొలగించడానికి ప్రతిరోజూ ఫ్లాస్ ఉపయోగించండి.
3. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. అంతే కాకుండా ఎక్కువగా నీరు త్రాగండి.
4. ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యులను సంప్రదించండి.