Ram Gopal Varma: తెలుగు ఇండస్ట్రీలో విలక్షణమైన దర్శకుడు ఎవరని అడిగితే రామ్ గోపాల్ వర్మ అని టక్కున చెప్పొచ్చు. ఎప్పుడు ఏదో ఒక సంచలనం క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన తీసే ప్రతి సినిమా సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఆయన నుంచి ఎటువంటి సినిమా వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తర్వాతి సినిమా ప్రకటించారు. ఆ సినిమా టైటిల్, ట్యాగ్ లైన్ , కథ వివరాలు గురించి చూద్దాం..
కొత్తగా ట్రై చేయనున్న వర్మ ..
మనోజ్ బాజ్ పాయ్ కీలక పాత్రలో హర్రర్ కామెడీ చిత్రాన్ని తీస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా ప్రకటించారు. తన కెరియర్ లో తొలిసారిగా హర్రర్ కామెడీ చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా పేరు పోలీస్ స్టేషన్లో దయ్యం. ప్రజలకు భయం వేస్తే పోలీసులు వద్దకు పరిగెడతారు. మరి పోలీసులే భయపెడితే అన్న కాన్సెప్ట్ తో ఈ హార్రర్ కామెడీ చిత్రం రానుంది. సినిమా పేరు పోలీస్ స్టేషన్లో దయ్యం, చనిపోయిన వారిని చంపలేరు అన్నది ట్యాగ్ లైన్. విలక్షణ సినిమాలు తీసిన వర్మ ఈసారి హర్రర్ కామెడీతో భయపెట్టనున్నారు. ఈ సినిమా నుండి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈసారి టార్గెట్ వారేనా ..
వివాదాస్పద సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ కి పెట్టింది పేరు. ఆయన నుంచి వస్తున్న ఈ సినిమా ఈసారి ఎన్ని వివాదాల్లో చిక్కుకుంటుందో చూడాలి. హర్రర్ కామెడీ చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. కొన్ని సినిమాలు బోల్తా పడ్డాయి. క్రైమ్ హర్రర్ సినిమాలని మాత్రమే తీసే వర్మ ఈసారి దానికి కామెడీని జోడించనున్నారు. ఈ సినిమా పోలీస్ స్టేషన్ కి లింకు పెట్టడంతో, ఎలాంటి వివాదాల్లో చిక్కుకుంటుందో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 2010లో వచ్చిన ‘రక్త చరిత్ర’ నుండి 2024 లో వచ్చిన ‘వ్యూహం’ సినిమా వరకు వివాదాల్లో చిక్కుకున్న సినిమాలే. వర్మ నుండి సినిమా అంటేనే.. ఈసారి ఎవరిని టార్గెట్ చేస్తున్నారా అని భయపడతారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో దయ్యం అని సినిమా అనౌన్స్ రావడంతో, పోలీసుల్ని టార్గెట్ చేసి సినిమా తీస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మనోజ్ బాజ్ పాయ్ సినిమా విషయాలకి వస్తే.. సత్య, కౌన్, తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ తో వర్మ మాయ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి డిఫరెంట్ జోన్ లో వర్మ తొలిసారి చేస్తుండడంతో అభిమానులలో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాతో వర్మ ఎలాంటి సెన్సేషన్స్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి..
After SATYA, KAUN and SHOOL I am thrilled to announce , me and @BajpayeeManoj are once again teaming up for a HORROR COMEDY a genre which neither of us did
I have done horror , gangster, romantic , political dramas , adventure capers, thrillers etc but never a HORROR COMEDY…
— Ram Gopal Varma (@RGVzoomin) April 9, 2025