BigTV English

Kaliyugam 2064 Trailer : థీమ్ బాగుంది… నటనలో శ్రద్ధ శ్రీనాథ్ మరో యాంగిల్

Kaliyugam 2064 Trailer : థీమ్ బాగుంది… నటనలో శ్రద్ధ శ్రీనాథ్ మరో యాంగిల్

Kaliyugam 2064 Trailer : ప్రతి హీరోయిన్ కెరియర్ లో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఉంటాయి అలా శ్రద్ధ శ్రీనాథ్ విషయానికి వస్తే, గౌతమ్ దర్శకత్వంలో వచ్చిన జెర్సీ సినిమా తనకి మంచి పేరును తీసుకొచ్చింది. అంతేకాకుండా వరుస అవకాశాలను కూడా తీసుకొచ్చింది. రీసెంట్గా సంక్రాంతి కానుక రిలీజ్ అయిన డాకుమహారాజు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ఫుల్ అయింది. ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది శ్రద్ధ శ్రీనాథ్. ఇక విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాఖీ సినిమాలో ఈమె పాత్ర కొంచెం కొత్తగా ఉంటుంది. ఇక ప్రస్తుతం శ్రద్ధ శ్రీనాథ్ మెయిన్ లీడ్ లో కలియుగం 2064 అనే సినిమాను చేస్తుంది. ఈ సినిమాకి ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లో విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను విడుదల చేస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ సినిమా ట్రైలర్ రాంగోపాల్ వర్మ లాంచ్ చేశారు.ఇప్పటికే మణిరత్నం లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేషాదరణ లభించింది.


రాంగోపాల్ వర్మ రియాక్షన్

ట్రైలర్ లాంచ్ తర్వాత దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. “ఇప్పుడే ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆబ్సోల్యూట్లీ ఒక ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఫోటోగ్రఫి,క్యారెక్టర్స్ డిజైన్. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్.. ఇలా అన్నీ ఒక మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ చదివిన ఫీలింగ్ ఇచ్చాయి. మే 9న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి. ఈ సందర్భంగా టీం నా బెస్ట్ విషెస్ చెబుతున్నాను” అంటూ తెలిపారు.


Also Read : Vedhika : ఏమిటో ఈమె.. ఎక్కడికెళ్లినా అందాల ప్రదర్శనే పనిగా పెట్టుకుంది!

ట్రైలర్ టాక్

ఇక ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ విషయానికి వస్తే భవిష్యత్తులో ముఖ్యంగా 2064 లో వచ్చే విపత్కర పరిస్థితుల్లో మనుషులు మనుగడ కోసం చేసే పోరాటాన్ని ప్రధానంగా చూపించారు. ఆహారం, నీరు, మానవత్వం అనేవి కరువైనప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోయి మనుషులు ఎలాంటి ఘోరాలకి పాల్పడ్డారు? అనే థీమ్ తో కలియుగంలోని పౌరాణిక ఇతివృత్తాలను గుర్తుచేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళే విధంగా ఉన్నాయి.ఈ ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలు పెంచుతుంది. భీమిలి కబడ్డీ సినిమా కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలు పెంచుతుంది. భీమిలి కబడ్డీ సినిమా కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు.  ముఖ్యంగా పి.సి.శ్రీరామ్ శిష్యుడు కె.రాంచరణ్ అందించిన సినిమాటోగ్రాఫి టాప్ నాచ్ లో ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×