Viral Video: పని పాటా లేని కొందరు యువకులు అడ్డదిడ్డంగా కారు నడుపు తున్నారు. వారి నిర్లక్ష్యానికి అన్నెం పుణ్యం తెలియనివారు ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాంటి ఘటన ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగింది. వైరల్‌గా మారిన ఆ సీసీ టీవీ ఫుటేజ్‌పై ఓ లుక్కేద్దాం.
మద్యం తాగి వాహనం నడవద్దు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అనౌన్స్‌మెంట్ పెట్టి చేయిస్తున్నారు. అయినా కొందరు యువకులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చెరువు బజార్ వద్ద కూలీలపైకి దూసుకెళ్లిన ఓ కారు.
పనులు నిమిత్తం బయటకు వెళ్లేందుకు కూలీలు రోడ్డుపై నిలబడ్డారు. అప్పటివరకు అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి వేగంగా దూసుకొచ్చింది ఓ కారు. కూలీలంతా తేరుకునేలోపు వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయపడ్డారు.
ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ కారణమైన డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఘటన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పరారు అయ్యాడు. అతడి పేరు పరిటాల భాస్కర్.
ALSO READ: 42 ఏళ్లుగా గల్ఫ్‌లో చిక్కుకున్న కొడుకు, 90 ఏళ్ల ఆ తల్లి నిరీక్షణ ఫలించేనా?
ఈ తతంగమంతా స్థానికంగా ఉండే ఓఇంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రమాదం జరగ్గానే ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడినవారు కూర్చోబెట్టారు. గాయాలు పెద్దగా తగలడంతో వెంటనే వెంటనే అంబులెన్సుకు కబురు పెట్టారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో కోలుకున్నట్లు సమాచారం.
కూలీలపైకి దూసుకెళ్లిన కారు.. సీసీ ఫుటేజ్ వైరల్!
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చెరువు బజార్ వద్ద అడ్డా కూలీలపైకి దూసుకెళ్లిన కారు
ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు
కారు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి… pic.twitter.com/CDrTin4upn
— BIG TV Breaking News (@bigtvtelugu) April 25, 2025