BigTV English

Surgical Strike : మీ ఇంటికొచ్చి మరీ చంపేస్తాం.. ఆనాటి సర్జికల్ స్ట్రైక్ ఎలా జరిగిందంటే..

Surgical Strike : మీ ఇంటికొచ్చి మరీ చంపేస్తాం.. ఆనాటి సర్జికల్ స్ట్రైక్ ఎలా జరిగిందంటే..

Surgical Strike : పాకిస్తాన్ మీద మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిందే. యావత్ దేశం చేస్తున్న డిమాండ్ ఇది. పహల్గాంలో ముష్కరుల మారణహోమం తర్వాత భారతీయులు బ్లడ్ బాయిల్ అవుతోంది. 26 మంది హిందూ పర్యాటకులను కాల్చి చంపిన సైతాన్ గాళ్లను.. రప్పారప్పా కాల్చి చంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాదుల వెనుకున్న పాపిస్తాన్ పని పట్టాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రధాని మోదీ సైతం అదే వార్నింగ్ ఇచ్చారు. భూమి అంచుల వరకు వెంబడిస్తాం.. ట్రాక్ చేసి.. దొరకబట్టి.. ఊహకు అందని రీతిలో శిక్షిస్తాం అని తేల్చి చెప్పారు. మోదీ ప్రకటనతో.. పాకిస్తాన్‌కు సర్జికల్ స్ట్రైక్స్ 2 తో మరోసారి గట్టి గుణపాఠం చెప్పాలనే వాదన వినిపిస్తోంది. వీసాలు నిలిపేయడం.. సరిహద్దులు బంద్ చేయడం.. లాంటి డోసులు దాయాది దేశానికి సరిపోవని.. 2016లో చేసినట్టే పాక్‌లోకి చొరబడి.. ఉగ్రవాదులు ఇంటికెళ్లి.. కాల్చి పడేయాలనే ఆవేశంతో రగిలిపోతోంది హిందూ రక్తం. ఇంతకీ ఆనాటి సర్జికల్ స్ట్రైక్ ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఎలాంటి ఫలితం వచ్చింది? అనేది మరోసారి చర్చకొస్తోంది. surgical strike పదం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.


సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే..

సెప్టెంబర్ 18, 2016. పంజాబ్, పాక్ బోర్డర్‌లోని ఉరీలో Indian Army స్థావరంపై నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు అటాక్ చేశారు. మన సైనికులు నిద్రలో ఉండగా ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడ్డారు. ఆ దాడిలో 19 మంది భారత సైనికులు అమరులయ్యారు. అంతకుముందు పఠాన్‌కోట్‌లోనూ అలాంటి ఘాతుకమే జరిగింది. వరుస ఘటనలతో భారత్ సహనం నశించింది. ఉగ్రవాదులకు, వారిని ఎగదోస్తున్న పాపిష్టి పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. దాని పర్యవసానమే సర్జికల్ స్ట్రైక్స్.


సర్జికల్ స్ట్రైక్స్ ఎలా చేశారంటే..

అది సెప్టెంబర్ 28–29, 2016… ఉరీ దాడి జరిగిన 11 రోజుల తర్వాత.. ఇండియన్ ఆర్మీ సరిహద్దు రేఖ LoC ను దాటింది.. కటిక చీకట్లో పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదుల స్థావరాలపై అటాక్ చేసింది.. 38 నుంచి 50 మంది టెర్రరిస్టులను మన సైన్యం మట్టుబెట్టింది.. కొన్ని గంటల్లోనే ఆ ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసేసింది.. తెల్లారే సరికల్లా మళ్లీ సురక్షితంగా మన భూభాగంలోకి తిరిగొచ్చేశారు సైనికులు.. పాకిస్తాన్‌కు ఈ విషయం తెలిసేలోగా అక్కడ ఇంకేమీ మిగలలేదు.. కాలుకాలిన పిల్లిలా గగ్గోలు పెట్టింది దాయాది దేశం. ఇదీ జరిగింది. అయితే, ఆ సర్జికల్ స్ట్రైక్స్ మరీ ఇంత సింపుల్‌గా జరగలేదు.. మినిట్ టు మినిట్ నరాలు తెగేంత ఉత్కంఠ..

ఎలైట్ పారా కమెండోలు..

భారత ఆర్మీ సత్తా చాటిన ఘటన సర్జికల్ స్ట్రైక్స్ 2016. ఉరీ ఉదంతం తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) పై అటాక్ చేయాలని కేంద్రప్రభుత్వం డిసైడ్ అయింది. ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ కోసం ఇండియన్ ఆర్మీలోని పవర్‌ఫుల్ సోల్జర్స్ అయిన పారాచూట్ రెజిమెంట్‌ను సెలెక్ట్ చేశారు. 4వ, 9వ, 21వ బెటాలియన్లకు చెందిన 80 మంది ఎలైట్ పారా-కమాండోలను రెడీ చేశారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW), భారత వైమానిక దళం మద్దతుతో.. సెప్టెంబర్ 28 అర్థరాత్రి స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు.

అటెన్షన్ డైవర్షన్..

ఆ రోజు రాత్రి ఉన్నట్టుండి.. నియంత్రణ రేఖ వెంబడి ఇండియన్ ఆర్మీ ఫిరంగులతో కాల్పులు జరపడం మొదలుపెట్టింది. పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడూలేనిది ఇండియన్ జవాన్లు తమ భూభాగంపై ఫైరింగ్ చేస్తున్నారంటని అదిరిపోయింది. వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది పాకిస్తాన్ ఆర్మీ. ఇదే మనకు కావాల్సింది. అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇలా చేశారు మనోళ్లు. ఓ వైపు ఫైరింగ్ జరుగుతుండగా.. మరోవైపు గప్‌చుప్‌గా పీవోకేలోకి దూసుకెళ్లారు కమాండోలు. నైట్ విజన్ గాగుల్స్, గ్రేనైడ్స్, రాకెట్ లాంచర్స్, మోడ్రన్ వెపన్స్‌తో ఫుల్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ 4 బృందాలుగా విడిపోయి నియంత్రణ రేఖను దాటేశాయి. అప్పుడు సమయం సాయంత్రం ఆరున్నర.

చీకట్లో కలిసిపోయి.. సౌండ్ చేయకుండా..

ప్రతీ బృందానికి నిర్ధిష్టమైన టార్గెట్స్ ఇచ్చారు. భీంబర్, లీపా, కెల్ సమీపంలోని ఉగ్ర శిబిరాలను నాశనం చేయాలనేదే వాళ్ల టాస్క్. ఆయా ప్రదేశాలకు చేరుకోవడం అంత ఈజీ కాదు. చిమ్మ చీకట్లో, కాలినడకన, నిశబ్దంగా కొండలు దాటాల్సి ఉంది. తాళ్లు, క్లైంబింగ్ గేర్‌లు, నావిగేట్ టూల్స్ సాయంతో గంటల తరబడి నడిచారు. చిన్న సౌండ్ కూడా చేయకుండా.. చీకట్లో కలిసిపోతూ.. పీవోకేలోని ఉగ్రవాదుల శిక్షణా శిబిరాల సమీపానికి చేరుకున్నారు. ఇక అంతే. టార్గెట్ కళ్లముందే కనిపించడంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.

4 గంటలు నాన్‌స్టాప్

గ్రెనేడ్‌లు, రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదుల డెన్‌పై అటాక్ చేశారు. బంకర్లను పేల్చేశారు. అస్సాల్ట్ రైఫిల్స్‌తో టెర్రరిస్టులను ఏరిపారేశారు. తీవ్రవాద శిబిరాలను నాశనం చేశారు. సుమారు 4 గంటల పాటు సాగింది ఆ సర్జికల్ స్ట్రైక్స్. ఇండియన్ ఆర్మీ గర్జనతో పాక్ ఆక్రమిత కశ్మీర్ దద్దరిల్లింది. ఆ గర్జన పాకిస్తాన్‌ ఉన్నతాధికారులకు వినిపించేలోపే.. వచ్చిన పని పూర్తి చేసేసి.. అంతే సైలెంట్‌గా తిరిగొచ్చేశారు పారా కమెండోలు. తెల్లారే సరికల్లా మనోళ్లు మన దేశంలో ఉన్నారు. అయితే, ఓ జవాన్ ల్యాండ్ మైన్‌పై కాలు వేయడంతో గాయపడ్డాడు. ఆ ఒక్క చిన్న డ్యామేజ్ మినహా.. సర్జికల్ స్ట్రైక్స్ 100 శాతం సక్సెస్ అయింది. సెప్టెంబర్ 29, ఉదయం 4:30 గంటలకు ఆపరేషన్ ముగిసింది. 38 నుంచి 50 మంది ఉగ్రవాదులను హతమార్చామని భారత సైన్యం ప్రకటించింది, అయితే పాకిస్తాన్ మాత్రం దీనిని తిరస్కరించింది. సరిహద్దుల్లో సాధారణ ఘర్షణ మాత్రమే జరిగిందని.. ఇద్దరు పాక్ సైనికులు మరణించారని, తొమ్మిది మంది గాయపడ్డారని బుకాయించింది.

ఇండియాన్ ఆర్మీ సత్తా.. ప్రపంచానికి తెలిసొచ్చేలా..

సర్జికల్ స్ట్రైక్ అంటే మెరుపు దాడి అని అర్థం. మెరుపులా పాక్‌లోకి ప్రవేశించింది ఇండియన్ ఆర్మీ. మెరుపులా ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది.. మెరుపులా మళ్లీ తిరిగొచ్చేసింది.. అందుకే, పీవోకేలో భారత్ జరిపిన ఆ సర్జికల్ స్ట్రైక్ 2016తో పాక్‌కే కాదు.. ప్రపంచ దేశాలకూ భారత సైన్యం సత్తా ఏంటో బలంగా చాటినట్టైంది. ఇజ్రాయెల్ మాత్రమే కాదు.. గెరిల్లా దాడులు చేయడంలో భారత్ కూడా దిట్ట అని తేలింది. ఆనాటి సర్జికల్ స్ట్రైక్స్‌లో పార్టిసిపేట్ చేసిన 19 మంది సోల్జర్స్‌కు శౌర్య పురస్కారం ప్రదానం చేసింది భారత ప్రభుత్వం. టీమ్ లీడర్ మేజర్ రోహిత్ సూరిని ‘కీర్తి చక్ర’ తో గౌరవించారు. రెండేళ్ల తర్వాత 2018లో.. సర్జికల్ స్ట్రైక్స్‌ 2016 అటాక్‌కు సంబంధించిన వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసింది సర్కారు. కట్ చేస్తే.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరపాలనే డిమాండ్లు బలంగా వస్తున్నాయి. చూడాలి మరి ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో….

Also Read : ఇండియా vs పాకిస్తాన్.. ఎవరి బలం ఎంత?

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×