Ram Gopal Varma: కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తాను చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్పే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఈయన. అవతలి వారు ఏమనుకుంటారు అనే విషయము గురించి ఆలోచించకుండా తాను చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బన్నీ గురించి, అతని ఫ్యాన్స్ గురించి కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా, సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప 2’. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మేరకు నిన్న రాత్రి హైదరాబాద్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. యావత్ సినీ హీరోలంతా ఆశ్చర్య పోయేలా అభిమానులు తరలి వచ్చారు.
బన్నీ ఫ్యాన్స్ పై వర్మ పోస్ట్..
ఈ ఈవెంట్ కి వచ్చిన జన సంద్రాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే బన్నీ ఫ్యాన్స్ ను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తాను దర్శకత్వం వహిస్తున్న శారీ సినిమా పోస్టర్ ను షేర్ చేస్తూ..”అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. #పుష్ప2కి ఉన్న మెగా క్రేజ్ ను చూస్తే స్పష్టమైన రుజువులా అనిపిస్తుంది..హే అల్లుఅర్జున్ , మీరు బాహుబలి కాదు స్టార్స్ యొక్క మెగాబలి” అంటూ పోస్ట్ చేశారు.
చిచ్చు పెట్టిన వర్మ..
అసలే మెగా వర్సెస్ అల్లు అంటూ అభిమానులు గొడవ పడుతుంటే ఇప్పుడు వర్మ చేసిన పోస్ట్ అందరికీ షాక్ కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి కాకుండా వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేయడం వల్లే అసలు వార్ మొదలయింది. అప్పటినుంచి అల్లు వర్సెస్ మెగా అన్నట్టు అభిమానులు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడుతున్నారు. ఇక దీనికి తోడు నిన్న ఈ సమస్యలను సాల్వ్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )ముఖ్య అతిథిగా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఆయన వస్తే మెగా అభిమానులు కూడా ఊరుకునేది లేదు అని కామెంట్లు చేసినట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు చివర్లో చిరంజీవి కూడా చేతులెత్తేయడంతో.. దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli)ని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తీసుకొచ్చారు. ఇక ఆయనతోపాటు పలువురు డైరెక్టర్లు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇలాంటి సమయంలో రాంగోపాల్ వర్మ కూడా మెగా అభిమానులను కించపరుస్తూ బన్నీ అభిమానులపై, బన్నీ క్రేజ్ పై చేసిన కామెంట్లు మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. మరి దీనిపై మెగా అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Share