BigTV English

Raghu Rama Krishnam Raju: రఘురామ ఎంట్రీ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్

Raghu Rama Krishnam Raju: రఘురామ ఎంట్రీ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్

Raghu Rama Krishnam Raju: తెలంగాణా పోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన పోలీసు అధికారుల తరహాలోనే ఎపిలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు విదేశాలకు పారిపోవాలని చూస్తున్నారా? డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణంరాజు అందుకే ఆరోపణలు గుప్పిస్తున్నారా? మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా చూడాలని ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు చేయడం అందుకేనా? కేసుల్లో నిందితులుగా ఉన్న ఐపీఎస్ లు ముందస్తు బెయిల్ పిటిషన్ లు దాఖలు చేసుకుంటున్నా.. పీఎస్ఆర్ ఆంజనేయులు లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారుల గురించి ప్రభుత్వం అసలు పట్టించుకోక పోతుండం వెనుక ఆంతర్యమేంటి?


ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో పీఎస్‌ఆర్ ఆంజనేయులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులు కేవలం జత్వానినే కాదని.. ఎంతోమంది మహిళలను వేధించారని, తన మాట వినకపోతే ఎన్నో ఇబ్బందులు పెట్టేవారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించింది. తన ఉద్యోగాన్ని అడ్డుగా పెట్టుకుని ఆ అధికారి సాగించిన చీకటి బాగోతాలు ప్రభుత్వం మారాక బయటకు వస్తున్నాయి. అయినా ఆయనపై ఇప్పటి వరకు చర్యలు లేవు

ఇక మరో ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్.. ఆంధ్రప్రదేశ్ లో మాజీ ఎంపీ, ప్రస్తుత డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రఘురామ కృష్ణ రాజుపై చేయి చేసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ పై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన విదేశాలకు పారిపోకుండా చూడాలని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తాజాగా పోలీసులను కోరారు.


రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీఐడీ అదనపు మాజీ ఎస్పీ విజయ్ పాల్‌ను అరెస్ట్ చేశారు. మరికొంతమందిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసు దర్యాప్తులో వేగం పుంజుకుందని.. న్యాయం ఎప్పుడు జరుగుతుందన్నది తెలియాల్సి ఉందని ఆర్ఆర్ఆర్ అంటున్నారు.

Also Read: గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు?

కస్టోడియల్ టార్చర్ కేసులో 5వ నిందితురాలు డాక్టర్ ప్రభావతి ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో తాను ఇంప్లిడ్ అవుతానని ఆర్ఆర్ఆర్ ప్రకటించారు. కస్టడీలో తనను బాగానే చూసుకున్నారని ఇద్దరు వీఆర్వోల సమక్షంలో.. తాను స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తప్పుడు లెటర్ సృష్టించారని ఆయన మండిపడ్డారు.

ఆ క్రమంలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా చూడాలని పోలీసులను రఘురామకృష్ణంరాజు కోరారు. విధినిర్వాహణలో ఉన్నప్పుడే విదేశాలకు వెళ్లి ఉల్లాసంగా… ఉత్సాహంగా గోల్ఫ్ ఆడిన ఘనుడని ఎద్దేవా చేశారు. ఆయనకు దుబాయ్‌లో వ్యాపారాలున్నాయని ఆరోపించారు. పీవీ సునీల్ కుమార్ తన ఇంట్లో పని చేసే వాళ్లు, సొంత మనుషులతో తనను తుద ముట్టించాలని చూశారని రఘురామ కృష్ణంరాజు ఆరోపణలు గుప్పిస్తున్నారు

ఆర్ఆర్ఆర్ కంప్లైంట్‌పై కేసు నమోదైనా ప్రధాన నిందితులు బయటే తిరుగుతున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి అధికారుల కేసుల గురించి అసలు పట్టించుకోని ప్రభుత్వం ఉప సభాపతిగా ఉన్న రఘురామరాజు కేసులో కూడా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతుండటం చర్చనీయాంశంగా మారింది. మరి గత ప్రభుత్వంలో అక్రమాలు, దౌర్జన్యాలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలు ఐపీఎస్‌ల అరెస్టులో జాప్యంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×