BigTV English

Ram Gopal Varma: గబ్బర్ సింగ్ దెబ్బ.. కాళ్లబేరానికి ఆర్జీవీ..?

Ram Gopal Varma: గబ్బర్ సింగ్ దెబ్బ.. కాళ్లబేరానికి ఆర్జీవీ..?

Ram Gopal Varma : రామ్‌గోపాల్‌వర్మ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్.. అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్‌‌కి సంబంధించి సోషల్‌ మీడియాలో పోస్టుల పెడుతూ ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటాడు. వైసీపీ సింపతైజర్‌గా సోషల్‌మీడియాలో ఆయన చేసిన హడావుడితో ఇప్పుడు ఆర్జీవీ కేసుల చట్రంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఆ ఎఫెక్ట్‌తో పవన్‌కళ్యాణ్, బాలకృష్ణలపై తెగ సెటైర్లు వేసిన అతని వాయిస్ సడన్‌గా మారిపోయింది. బాలయ్య నటించిన డాకూ మహారాజ్ టీజర్‌పై ఆర్జీవీ పొగడ్తల వర్షం కురిపిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.


కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్లు, సినిమాలపై.. ఇప్పుడు వేట మొదలైంది. వైసీపీ హయాంలో.. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ని నెగటివ్‌గా చూపిస్తూ.. కాంట్రవర్శీ సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ .. సోషల్ మీడియాలో కూడా వైసీపీ నాయకుడిలా చెలరేగిపోయారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయి ఏపీలో అతనిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయ్. జగన్ పాలనలో రెచ్చిపోయిన ఆర్జీవీకి.. ఇప్పుడు కూటమి పాలనలో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది.

సంచలన సినిమాలను తెరకెక్కిస్తూ ఎప్పుడు వివాదాలతో సావాసం చేసే ఆర్జీవీ… రాజకీయం నేపథ్యంలో పలు సినిమాలను కూడా తెరకెక్కించారు. వైసీపీ హయాంలో జగన్ మెప్పు కోసం వైసీపీ లీడర్ల సొమ్ముతో ప్రతిపక్ష నేతలపై అడ్డూ అదుపు లేకుండా.. అడ్డదిడ్డంగా సినిమాలు తీసేశారు. నచ్చితే చూడండి లేకపోతే లేదు. అంటూ రెచ్చిపోయారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అతను ఎవర్నీ వదిలిపెట్టకుండా అవమానకరమైన పోస్టులు పెట్టి కాంట్రావర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు.


ఏపీ ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్‌ సమయంలో నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వర్మపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆ క్రమంలో తుళ్లూరు పోలీసుల ఆర్జీవీపై కేసు నమోదు చేశారు.

Also Read: స్టార్ హీరోయిన్ కి యాక్సిడెంట్.. హాస్పిటల్ కి తరలింపు..!

కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం.. సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు, ట్వీట్‌లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. కేసులు నమోదైన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారంలో.. ఎక్కువగా వైసీపీ సానుభూతిపరుల మీదే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైనా కేసులు నమోదవడం హాట్ టాపిక్‌గా మారింది. అప్పటి వరకు కేసులకు బయపడేది లేదని ప్రగల్భాలు పలికిన ఆర్జీవీలో.. ప్రకాశం జిల్లా పోలీసుల నోటీసులు అందుకున్న నేపధ్యంలో భయం మొదలైనట్లు కనిపిస్తుంది.

వైసీపీ అధికారంలో ఉండగా.. రాంగోపాల్ వర్మ చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పాత్రలతో.. తనకిష్టమొచ్చినట్లుగా సినిమాలు తీస్తూ వెళ్లారు. వారితో పాటు నందమూరి బాలకృష్ణపై కూడా సోషల్ మీడియాలో తెగ సెటైర్లు విసిరారు. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అప్పుడు ఆర్జీవీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అన్నాడు

ఆ తర్వాత ఏదో సందర్భంలో బాలకృష్ణతో రోజా దిగిన సెల్ఫీని ట్వీట్ చేసి బాలయ్యపై తెగ సెటైర్లు విసిరాడు. రోజా అందంగా ఉందంటూ పొగిడిన వర్మ.. బాలకృష్ణను దిష్టిబొమ్మ అంటూ ట్రోల్ చేయడం గమనార్హం. సెల్ఫీలో రోజా అతనికి హీరోలా కన్పించిందంట. ఆమె కుడి పక్కన విగ్ లేకుండా ఉన్న బాలకృష్ణ ఎవరో తనకు తెలయదన్నట్లు కామెంట్లు పెట్టాడు. ఆ ట్వీట్‌లో ‘అందమైన రోజా గారి పక్కన కూర్చుని.. ఆ ఫోటోను నాశనం చేసిన ఈ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా..?’ అంటూ మరో ట్వీట్ చేసిన. ఆర్జీవీపై బాలయ్య అభిమానులు అప్పట్లో తీవ్రంగా మండిపడ్డారు.

వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్లలో తన పోస్టుల్లో అలాంటి వెటకారాలు చాలానే చేశారాయన. అదే ఆర్జీవీ తాజాగా బాలయ్య నటించిన డాకూ మహరాజ్ సినిమా టీజర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. రేపు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న డాకూ మహరాజ్ మళ్లీ సంక్రాంతి వరకు ఆడుతుందని.. హాలీవుడ్‌ రేంజ్లో బాలకృష్ణ నటించిన ఆ మూవీ 365 రోజులు పక్కాగా ఆడేస్తుందని ట్వీట్ చేశాడు.

ఆర్జీవీలో ఈ సడన్ ఛేంజ్ చూస్తూ నందమూరి అభిమానులు తెగ సెటైర్లు విసురుతున్నారు. వరుసగా నమోదవుతున్న కేసులతో ఆర్జీవీకి భయం పట్టుకుందని ఆ కేసుల భయంతోనే అతను బాలయ్యను కాకా పడుతున్నాడని యద్దేవా చేస్తున్నారు. ఎంత కాకాపట్టినా వర్మ మెడకు కేసుల ఉచ్చు బిగుసుకోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×