BigTV English

Biden Ukraine Help: అధ్యక్షుడిగా చివరి రోజుల్లో ఉక్రెయిన్ కోసం బైడెన్ భారీ సాయం.. ఆయుధాల వినియోగానికి అనుమతి

Biden Ukraine Help: అధ్యక్షుడిగా చివరి రోజుల్లో ఉక్రెయిన్ కోసం బైడెన్ భారీ సాయం.. ఆయుధాల వినియోగానికి అనుమతి

Biden Ukraine Help| రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అమెరికా రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. యుద్ధంలో ఉక్రెయిన్ కోసం అన్ని విధాలుగా మద్దతు చేయాలని ప్రయత్నిస్తుండగా.. తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఉక్రెయిన్ యుద్ధంలో ఆయుధాలు, ఆర్థిక సాయం చేయడం వల్ల అమెరికాకు భారీ నష్టం జరుగుతోందని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లో బైడెన్ తన పదవీ కాలం ముగియనుంది. దీంతో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను పదవిలో ఉండే లోపే ఉక్రెయిన్ కు వీలైనంత సాయం చేయాలని భావించి లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వినియోగానికి అనుమతులు ఇచ్చేశారు.


రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధంలో అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఇప్పటికే ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సైనిక దళాలు, మిస్సైల్స్ సరఫరా చేయడంతో ఉక్రెయిన్ ఈ యుద్ధంలో సరిహద్దు పట్టణాల నుంచి రష్యా ఆర్మీని తరిమికొట్టింది. అయితే అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక ఎటిఎసిఎంఎస్ రాకెట్స్ వినియోగడానికి ఆంక్షలున్నాయి. గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్ ఈ ఆంక్షులు తొలగించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చింది.

Also Read: 100 మంది విదేశియులకు మరణ శిక్ష.. సౌదీలో రికార్డ్.. భారతీయులు ఎంతమంది అంటే?..


ఈ రాకెట్స్ ప్రయోగిస్తే.. రష్యా భూభాగంలో 300 కిలో మీటర్ల దూరం వరకు దాడి చేయొచ్చు. దీని వల్ల యుద్ధంలో రష్యాపై ఒత్తిడి తీసుకురావచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్ కు మద్దతుగా నాటో కూటమి బలగాలు యుద్దంలో దిగడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఎత్తుకు పై ఎత్తు వేశారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌తో జూలై నెలలో మిలిటరీ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. ఉత్తర్ కొరియాకు కావాల్సిన మిలిటరీ ఆయుధాలను రష్యా సరఫరా చేస్తుంది. ఈ ఆయుధాల జాబితాలో అణు ఆయుధాలు కూడా ఉండడం గమనార్హం.

అయితే దీనికి బదులుగా ఉత్తర్ కొరియా తన సైనికులను ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా పంపిస్తుంది. ఇప్పటికే ఉత్తర కొరియాకు చెందిన 10000 మందికి పైగా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైన్యంతో కలిసి పోరాడుతున్నారని సమాచారం.

యుద్ధం రంగంలో కొరియా సైనికులు రావడంతో అమెరికా మండిపడింది. ఇదే అదునుగా జెలెన్‌స్కీ గత నెల రోజులుగా తమక లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ప్రయోగించే అనుమతులు ఇవ్వాలని కోరుతూ వచ్చారు. కానీ అమెరికా ఎన్నికలు ఉండడంతో బైడెన్ తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించడంతో.. ఆయన జనవరి 20న అధ్యక్ష పదవి చేపడితే.. ఉక్రెయిన్ కు మద్దతు ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. దీంతో బైడెన్ తాజాగా ఆ లాంగ్ రేంజ్ మిసైల్స్ వినియోగానికి అనుమతులు ఇచ్చేశారు.

దీనిపై అమెరికా అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగిస్తే.. రష్యాకు భారీ నష్టం తప్పదు. ఆ తరువాత ఒకవేళ యుద్ధం ఆపేయాలని చర్చలు జరిపినా రష్యా ఎక్కువగా డిమాండ్ చేయలేని పరిస్థితులుంటాయని అభిప్రాయపడ్డారు. అయితే బైడెన్ చర్యల పట్ల రష్యా ఎలా స్పందిస్తూ వేచి చూడాల్సిందే.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×