SaifAlikhan : ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) ఈరోజు ఉదయం లీలావతి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం తనను సకాలంలో హాస్పిటల్ కి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా (Bhajan singh rana) ను సైఫ్ అలీ ఖాన్ కలిసారు. ముఖ్యంగా తన ఇంట్లో దాడి జరిగిన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లి తనను కాపాడిన భజన్ సింగ్ రాణాకు కృతజ్ఞతలు తెలియజేశారు. సైఫ్ అలీ ఖాన్ సింగ్ తో సైఫ్ అలీ ఖాన్ దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాకు భారీ నజరానా..
ఇకపోతే సైఫ్ అలీఖాన్ ను కాపాడిన డ్రైవర్ భజన్ సింగ్ రాణాకు ఇటీవల ఆయన భార్య కరీనా కపూర్ (Kareena kapoor) 11,000 రూపాయలు బహుమతిగా చెక్కును అందజేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తన ప్రాణాలను కాపాడిన అతడిని కలిసి బహుమతిగా ఏదైనా ఇచ్చాడా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రానాకు సైఫ్ అలీ ఖాన్ మరిచిపోలేని బహుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సైఫ్ అలీ ఖాన్ పై దాడి..
అసలు విషయంలోకెళితే, ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎప్పటిలాగే జనవరి 16వ తేదీన నిద్రిస్తున్న సమయంలో తన పిల్లల రూమ్ లోకి ఒక దొంగ చొరబడ్డారు. అయితే పిల్లల దగ్గరే ఉండే కేర్ టేకర్ గట్టిగా అరిచింది. అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఉలిక్కిపడ్డ సైఫ్ అలీఖాన్ ఆ దొంగను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. దీంతో అతడు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. సైఫ్ అలీ ఖాన్ నిరాకరించారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ పై పలుమార్లు కత్తితో దాడి చేశారు ఆ దొంగ. ఇదంతా కూడా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో దాడి జరిగింది. అతన్ని 3:30 నిమిషాలకు లీలావతి హాస్పిటల్ కు తీసుకెళ్లారు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా.
సైఫ్ అలీ ఖాన్ కి సర్జరీ పూర్తి..
ఇకపోతే సైఫ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో హీరోని పొడవుగా ఆరు చోట్ల బలమైన కత్తిపోట్లు ఉన్నట్లు లీలావతి హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. రెండు చోట్ల మాత్రం ఆ కత్తిపోట్లు చాలా లోతుగా ఉన్నాయని తెలిపారు. అంతేకాదు వెన్నుపూస సమీపంలో కత్తి విరిగి అక్కడే గుచ్చుకుపోయింది. ఇక సర్జరీ చేసి ఆ కత్తిని తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు.
రూ.15 వేల కోట్ల ప్రాపర్టీని స్వాధీనం చేసుకుంటున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం..
ఇదిలా ఉండగా మరొకవైపు దేశ విభజన తర్వాత పాకిస్తాన్ కి వలస వెళ్లిన పటౌడీ కుటుంబ సభ్యుల ఆస్తులను ఎనిమీ ఆక్ట్ కింద మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సైఫ్ అలీఖాన్ కుటుంబానికి సంబంధించి, రూ.15 వేల కోట్ల ప్రాపర్టీ ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం కాబోతున్నట్లు సమాచారం.
తనపై దుండగుడు కత్తితో దాడి చేసిన తర్వాత సకాలంలో ఆసుపత్రికి తరలించిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిసిన సైఫ్ అలీ ఖాన్ pic.twitter.com/qHFDrEmTAM
— BIG TV Breaking News (@bigtvtelugu) January 22, 2025