Ram Gopal Varma:మెగా-అల్లు ఫ్యామిలీ (Mega-Allu Family) మధ్య గత ఏడాది ఎన్నికల టైం నుండే చిచ్చు రగులుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవలకి.. అగ్నికి ఆజ్యం పోసినట్లు కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడే మాటలు తోడవుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 (Pushpa-2) సినిమా అతిపెద్ద హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ ని మెచ్చుకుంటూ మెగా ఫ్యామిలీని కించపరుస్తూ.. రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) చేసిన సెటైరికల్ ట్వీట్స్ మీడియాలో ఎంత సంచలనం సృష్టించాయో చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న రాంగోపాల్ వర్మ తన సెటైరికల్ ట్వీట్స్ కు సంబంధించి అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టిన ట్వీట్స్ కి సంబంధించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ ఆర్జీవి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. తాజాగా ఆర్జీవి(RGV) ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ బెస్ట్..
ఇందులో యాంకర్ మీరెందుకు మెగా ఫ్యామిలీని కించపరుస్తూ అల్లు అర్జున్ (Allu Arjun) ని గొప్పగా చెబుతున్నారని అడగగా.. “అల్లు అర్జున్ ని నేను గొప్పగా చెప్పలేదు. ఆయన బాక్సాఫీస్ లెక్కలే ఆయన్ని మంచి పొజిషన్లో నిలబెడుతున్నాయి. వారిద్దరి మధ్య నేనేమీ కాంపౌండ్ కట్టడం లేదు”. అని క్లారిటీ ఇచ్చారు. అలాగే మెగా ఫ్యామిలీలో ఉన్న అందరి హీరోలకెల్లా అల్లు అర్జున్ బెస్ట్ అని ఎందుకన్నారు అని యాంకర్ అడగగా.. “ఇప్పటి జనరేషన్లో మెగా ఫ్యామిలీలో అల్లు అర్జునే పెద్ద స్టార్ అనిపిస్తుంది. ఇండస్ట్రీలో ఉండే ట్యాగ్ ఎప్పుడూ ఒకరికే ఉండవు. బాలీవుడ్ నుండి మొదలు టాలీవుడ్ వరకు వాళ్ళు చేసే సినిమాలను బట్టి ఆ ట్యాగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి.ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఒక్కడే స్టార్ అనిపిస్తుంది. చిరంజీవి ఒకప్పుడు స్టార్ కావచ్చు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ బెస్ట్ అనిపిస్తుంది.ఒక స్టార్ హీరో కొడుకు స్టార్ అవ్వడం కామనే. కానీ ఒక కమెడియన్ కొడుకు స్టార్ అవ్వడం గొప్ప.”. అంటూ రాంగోపాల్ వర్మ మాట్లాడారు.
అల్లు – మెగా అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన వర్మ..
అలాగే మీరు ఎందుకు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని టార్గెట్ చేస్తూ సెటైరికల్ ట్వీట్స్ వేస్తారు అని ప్రశ్నించగా.. “నాకేమీ వాళ్ళ మీద పగలేదు. కానీ నేను అందరి మీద సెటైర్స్ వేస్తాను.నా మీద నేను కూడా వేసుకుంటాను. పొద్దున లేచినప్పటి నుండి చేసే పని అదే కదా” అంటూ క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఆర్జీవి మాట్లాడిన మాటలు మాత్రం మళ్లీ మెగా – అల్లు అభిమానుల మధ్య అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఉన్న స్టార్ హీరోలలో అల్లు అర్జున్ బెస్ట్ అనడం కొంతమందికి నచ్చడం లేదు. చాలా రోజుల నుండి ఉప్పు నిప్పులా ఉంటున్న మెగా ఫ్యామిలీ పై ఎప్పుడు ఎవరో ఒకరు చేసే కామెంట్లు మరింత దూరాన్ని పెంచుతున్నాయి. ఎన్నికలప్పుడు జరిగిన గొడవలు అల్లు అర్జున్ జైలుకు వెళ్లడంతో సమసిపోయాయి. కానీ రామ్ చరణ్(Ram Charan) అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంతో ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయి.