RGV’s Syndicate Movie :రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) .. ఒకప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్.. కానీ ఈ మధ్య ఆయన దర్శకత్వం వహించిన సత్య(Satya ) సినిమా రీ రిలీజ్ అయిన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చిందని తెలుస్తోంది. దీనికి తోడు వర్మ తన అధికారిక ఖాతా ఎక్స్ లో ఒక సుదీర్ఘ పోస్ట్ కూడా పెట్టారు. ఇక అందులో సత్య సినిమా హిట్ అయ్యాక తనకు అహంకారం వచ్చిందని, ఆ సినిమా తర్వాత మంచి సినిమాలు తీయాల్సింది పోయి చెత్త సినిమాలు తీసినట్టు ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఒక సినిమా తీసి తన టాలెంట్ ను నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్నారు వర్మ. అందులో భాగంగానే ఒక కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.ఆ చిత్రానికి సిండికేట్ (Syndicate)అని టైటిల్ ని కూడా ప్రకటించాడు.
అదే టార్గెట్ అంటున్న వర్మ..
ముఖ్యంగా “భారతదేశ ఉనికినే ప్రశ్నార్ధకం చేయాలని చూసే ఒక సంస్థ పై తీస్తున్న సినిమానే సిండికేట్ అని”, ” మనుషులే జంతువుల కంటే అత్యంత క్రూరమైన వాళ్లు” అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్ గా కూడా వర్మ పెట్టినట్లు తెలిపాడు. ఒకప్పుడు ఇండియాలో స్ట్రీట్ గ్యాంగ్స్ , స్మగ్లర్లు ఆపై ఆల్కైదా లాంటివి ఉండేవి. కానీ గత పదిహేనేళ్లుగా ఇండియాలో ఎలాంటి క్రిమినల్ ఆర్గనైజేషన్స్ లేవు. కేవలం దేశాల మధ్య కొత్తగా ఇలాంటి క్రైమ్ ఆర్గనైజేషన్ మాత్రమే పుట్టుకొస్తున్నాయి.. దానిపైనే ఒక సినిమా తీయాలని అనుకుంటున్నట్లు వర్మ తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమాలో మనుషులు ఎంత తీవ్ర స్థాయికి చేరుకోగలరో కూడా చూపించినట్టు సమాచారం. ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలను తెలియజేస్తానని చెప్పిన వర్మ, ఇప్పుడు ఈ సినిమాలో నటించబోయే తారాగణం గురించి కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
సిండికేట్ కోసం భారీ తారాగణం..
ముఖ్యంగా టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు భారీ తారాగణమును ఈ సిండికేట్ మూవీలో భాగం చేయనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఈ సిండికేట్ మూవీలో వెంకటేష్ (Venkatesh) ని హీరోగా ఫిక్స్ చేసేసారు వర్మ. అటు వెంకటేష్ కూడా ఈ సినిమా చేయడానికి సిద్ధం అయిపోయారు. ఈయనతో పాటు విజయ్ సేతుపతి(Vijay Sethupathi), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు, ప్రస్తుతం విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ భారీ ప్రాజెక్టును దగ్గుబాటి సురేష్ బాబు (Daggubati Suresh babu) సెట్ చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే కావడం గమనార్హం. ముఖ్యంగా ఈ ప్రాజెక్టును సెట్ చేయడానికి సురేష్ బాబు చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వర్మ తలుచుకుంటే మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకోగలను అని చెబుతున్నాడు. మరి ఈ సిండికేట్ సినిమాతో వర్మ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి. ఏది ఏమైనా వర్మ ఆలోచనకి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఐడియాలు ఒక్క వర్మ గారికే వస్తాయి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.