BigTV English

US Halts Foreign Aid : ప్రపంచదేశాలకు ఆర్థిక సాయం నిలిపివేసిన అమెరికా.. ఇజ్రాయెల్ తప్ప

US Halts Foreign Aid : ప్రపంచదేశాలకు ఆర్థిక సాయం నిలిపివేసిన అమెరికా.. ఇజ్రాయెల్ తప్ప

US Halts Foreign Aid | ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆర్థిక సాయం అమెరికా నిలిపివేసింది. అన్ని దేశాలకు తక్షణమే ఆర్థిక సాయం నిలిపివేస్తున్నట్లు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో శుక్రవారం రాత్రి (జనవరి 24, 2025)న ప్రకటించారు. అయితే ఈ జాబితాలో ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలను మినహాయించారు. ఈ రెండు దేశాలకు మిలిటరీ సాయం, ఆర్థిక సాయం అమెరికా అందిస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు.


ప్రపంచంలోని అన్ని అమెరికా రాయబార కార్యాలయాలకు మార్క్ రూబియో ప్రభుత్వ నిర్ణయాలను తెలియజేశారు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త విదేశీ పాలసీల ప్రకారమే ఈ ఆదేశాలు జారీ అయ్యాయని ‘ది న్యూ యార్క్ టైమ్స్’ ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. అమెరికాను ఆర్థికంగా బలపరిచేందుకే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

ఈ ఆదేశాల ప్రకారం.. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల సాయంతో రష్యా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు కూడా ఆర్థిక సాయం ఆపివేయబడింది. అన్ని ప్రపంచ దేశాలకు తక్షణమే ఆర్థిక సాయం నిలిపివేయబడింది, ఏదైనా అత్యవసర కార్యక్రమాల కోసం లేదా మినహాయింపుల కోసం సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఆమోదం ఉంటే ఆ దేశాలకు మాత్రమే ఆర్థిక సాయం కొనసాగించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు.


Also Read: గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరు అఫీషియల్.. గ్రీ‌న్‌‌లాండ్ కోసం డెన్మార్క్ ప్రధానికి ట్రంప్ బెదిరింపులు

అమెరికా తీసుకున్న ఈ కఠిన నిర్ణయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు వైద్య కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్ధాంతరంగా నిలిచిపోనున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అనుమతించిన మిలిటరీ ఆర్థిక సాయం కూడా నిలిచిపోనుంది. కానీ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అమెరికాతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలకు మాత్రం అమెరికా నుంచి ఆర్థిక సాయం కొనసాగుతుంది. ప్రతీ సంవత్సరం ఇజ్రాయెల్ కు మిలిటరీ ఆర్థిక సాయం కోసం అమెరికా 3.3 బిలియన్ డాలర్లు అందిస్తోంది. ఈ సాయంతోనే ఇజ్రాయెల్ ఇంతకాలం గాజాలో హమాస్ తో యుద్ధం చేస్తూ ఉంది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఇజ్రాయెల్ దేశంతో 1979లో శాంతి సంధి చేసుకున్నందుకు ఈజిప్ట్ కు అమెరికా భారీగానే ఆర్థిక సాయం అందిస్తోంది.

అమెరికాలో అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ 90 రోజుల పాటు ప్రపంచ దేశాలకు ఆర్థిక సాయం నిలిపివేస్తానని ముందే చెప్పారు. ఈ మేరకే సెక్రటరీ ఆఫ్ స్టేట్ తాజాగా ప్రకటన జారీ చేశారు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ప్రపంచంలో అమెరికా ప్రభావం తగ్గిపోతుందని, అమెరికా మిత్ర దేశాలే ఇకపై పోటీదారులగా మారే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచదేశాలకు అమెరికా అన్ని రకాల ఆర్థిక సాయం నిలిపివేయడంతో ప్రపంచంలో తయారీ రంగం సంక్షోభానికి గురి అయ్యే ప్రమాదముంది. దీంతో పాటు విద్య, వైద్య, మానవతా సేవల కార్యక్రమాలు వెంటనే నిలిచిపోనున్నాయి. ఉదాహరణకు యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో గర్భిణీ మహిళలకు ఉచిత వైద్యం, టీకా కార్యక్రమాలు ఆగిపోనున్నాయి. ఈ కార్యక్రమాలకు ఆర్థిక సాయం కొనసాగించాలని ట్రంప్ ఆదేశాల్లో వీటికి మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే ఉక్రెయిన్ వైద్య రంగం అమెరికాకు అభ్యర్థిన చేసింది. కానీ 90 రోజుల వరకు ఎలాంటి ఆర్థిక సాయం అందించేది లేదని అమెరికా స్పష్టం చేసింది.

మరోవైపు గాజాలో కాల్పుల విరమణ చేసినందుకే ఇజ్రాయెల్ కు ఆర్థిక సాయం కొనసాగిస్తున్నామని తెలిపింది. అయితే గాజాలో, ఆఫ్రికాలోని సుడాన్ దేశంలో కరువు, ఆకలి చావులు కేసులు వందల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. కానీ అమెరికా మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధుల అందించేది లేదని ప్రకటించింది. దీంతో గాజాలో ఆరోగ్య సంకోభం నెలకొంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక చివరగా అమెరికా నిర్ణయంతో అందరికంటే ఎక్కువగా నష్టపోయేది ఉక్రెయిన్, జార్జియా, తైవాన్ లాంటి దేశాలు. ఈ దేశాలు తమ మిలిటరీని అమెరికా నిధులతోనే నిర్వహిస్తున్నాయి. అందుకే ఈ దేశాల ప్రతినిధులు తమకు నిధులు కొనసాగించాలంటూ అమెరికా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×