BigTV English

Israel Palestine War : ఆరవరోజుకు చేరిన ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. బంధీలను విడిచిపెట్టిన హమాస్

Israel Palestine War : ఆరవరోజుకు చేరిన ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. బంధీలను విడిచిపెట్టిన హమాస్

Israel Palestine War : ఇజ్రాయెల్ – హమాస్ తీవ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధం గురువారం నాటికి ఆరవరోజుకు చేరుకుంది. హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ పై జరిపిన తీవ్రమైన దాడుల్లో ఇప్పటి వరకూ వందలాది మంది చనిపోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. కాగా.. బుధవారం హమాస్ తమ బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ మహిళ, ఆమె బిడ్డను విడిచిపెట్టారు. ఇజ్రాయెల్ నుంచి 150 మందిపైగా పౌరులను హమాస్ తీవ్రవాదులు ఎత్తుకు పోగా.. ఈ తల్లీ, బిడ్డను మాత్రం ఏ కారణాలతో విడిచిపెట్టారన్న విషయాలు ఇంకా తెలియలేదు.


అలాగే.. హమాస్ మరోసారి ఇజ్రాయెల్ కు హెచ్చరికలు చేసింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ముందస్తు నోటీసు లేకుండా గాజాలోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న ప్రతిసారీ బంధీలకు హాని చేస్తామని బెదిరింపులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో హమాస్ తమ బంధీలుగా ఉన్న తల్లి, బిడ్డను వదిలిపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనివెనుక హమాస్ ఏమైనా కుట్ర పన్నిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఐదురోజులపాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ లు గాజా స్ట్రిప్ పై వైమానిక దాడులు చేశాయి. ఫలితంగా అనేక భవంతులు ధ్వంసమయ్యాయి. టెల్ అవీవ్ సంస్థ గాజాలోకి ఆహారం, ఇంధనం, మందుల సరఫరా, అవసరమైన సామాగ్రిని నిలిపివేసింది. అక్టోబర్ 7న హమాస్ గాజా స్ట్రిప్ పై చేసిన ఆకస్మిక దాడి తర్వాత.. ఇజ్రాయెల్ సైన్యం గాజాలో ఉన్న హమాస్ పై దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ 2100 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇరువైపుల నుంచి ఎవరూ రాజీకి సిద్ధంగా లేకపోవడంతో.. మరింత ప్రాణనష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయెల్ పౌరులను హతమార్చిన హమాస్ ను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.


అధికారిక లెక్కల ప్రకారం.. ఇజ్రాయెల్ – పాలస్తీన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ.. 155 మంది సైనికులు సహా సుమారు 1200 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గాజాలో 260 మంది పిల్లలు, 230 మంది మహిళలు సహా 900 మంది చనిపోయారు. హమాస్ దాడిచేసిన ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం తిరిగి తమ నియంత్రణలోకి తీసుకున్నాయి. హమాస్ పై దాడుల అనంతరం గాజా సరిహద్దు ప్రాంతాలపై నియంత్రణ పొందినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

https://twitter.com/jacksonhinklle/status/1712228800010793155?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1712228800010793155%7Ctwgr%5Ef9d3b1bfa04fd58f4589f098f9be3073d3b7a7c1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Fenglish%2Fnews9li3150295846716-epaper-dhfc063adcceaa4f4799aee937999624d2%2Fhamasreleasesisraelimotherandchildhostageswatchvideo-newsid-n546423690

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×