Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ – పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు.. ఐ లవ్ పాకిస్థాన్ అంటూ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. ఇండియా – పాక్ సీజ్ ఫైర్‌పై ట్రంప్ జోక్యం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ దానిపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోదీ స్పందనపై ట్రంప్ ఈ విధంగా మాట్లాడారు. ‘యుద్ధాన్ని నేను ఆపాను.. ఐ లవ్ పాకిస్థాన్. మోదీ గొప్ప వ్యక్తి.. నిన్న రాత్రే ఆయనతో మాట్లాడాను. భారత్, పాకిస్థాన్ రెండూ న్యూక్లియర్ దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపాను. గత రాత్రే ట్రేడ్ డీల్ గురించి చర్చించాను. యుద్దం ఆపడంలో పాకిస్థాన్ నుంచి ఆసిఫ్ మునీర్, భారత్ నుంచి ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారు..’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
🗣️ Donald Trump:
“I love Pakistan. I stopped the war. Modi is a fantastic man.” 🇺🇸🇮🇳🇵🇰
Trump once again praises PM Modi, while balancing his words on South Asia diplomacy.#TrumpOnModi #TrumpOnPakistan #Geopolitics https://t.co/mP7UrZogdt
— Dhanesh Kumar (@DkBoss26) June 18, 2025