Ram Charan Peddi :డాషింగ్ డైరెక్టర్ బుజ్జి బాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రానున్న చిత్రం పెద్ది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవర సినిమాతో మన ముందుకు వచ్చిన జాన్వి, ఇప్పుడు రామ్ చరణ్ తో సందడి చేయనుంది.తాజాగా ఈ సినిమా గ్లిమ్స్ ని విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ గ్లిమ్స్ వీడియో టాలీవుడ్ లో సోషల్ మీడియాలోను రికార్డులను సృష్టిస్తుంది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్లో ట్రెండింగ్ లో నిలిచింది రామ్ చరణ్ పెద్ది గ్లిమ్స్. ఈ విషయాన్ని చరణ్ అభిమానులు నెట్టింట షేర్ చేస్తున్నారు. ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ మన ముందుకు వచ్చింది దాని గురించి తెలుసుకుందాం..
పెద్ది నుండి మరో అప్డేట్
మెగా అభిమానులకు పండగ స్పెషల్ గా శ్రీరామనవమి రోజున, తెలుగులో గ్లిమ్స్ విడుదల చేశారు. నేడు దీని హిందీ గ్లిమ్స్ ను ,విడుదల చేశారు. అందులో ప్రత్యేకమైన వాయిస్ ఒకటి మనకు వినిపిస్తుంది. హిందీ వెర్షన్ కు వాయిస్ ఇచ్చినది ,ఎవరో కాదు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తన పాత్రకు రాంచరణ్ స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ఆయన అంతకుముందు డబ్బింగ్ చెప్పిన చిత్రాలను మనం చూస్తే 2017 లో వచ్చిన ‘ధ్రువ’ హిందీ వర్షన్ కు తన సొంత వాయిస్ అందించాడు రామ్ చరణ్. ఇదే రామ్ చరణ్ మొదటి సారి డబ్బింగ్ చెప్పిన చిత్రం. ఆ తరువాత ‘RRR’ కు జూనియర్ ఎన్టీఆర్ తో ,రామ్ చరణ్ కూడ తన పాత్రకు, హిందీలో డబ్బింగ్ చెప్పడం విశేషం. రామ్ చరణ్ సినిమాలు అన్నీ హిందీలోడబ్బింగ్ అవుతాయి. కానీ కొన్నిటికి మాత్రమే తానే స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు పెద్ది సినిమాకి హిందీ టీజర్ కు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. మెగా అభిమానులు హిందీ గ్లిప్స్ ను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ వచ్చిన నిమిషాల్లోనే వైరల్ అవ్వటం విశేషం .
భాష ఏదైనా సరే వాయిస్ ఆయనదే..
ఈ సంవత్సరం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ తో మన ముందుకు వచ్చిన రామ్ చరణ్ డీసెంట్ హిట్టుతో సక్సెస్ ని అందుకున్నారు. ‘RRR’ సినిమా తో గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఉప్పెన సినిమా తరువాత బుచ్చిబాబు తీస్తున్న రెండో సినిమా కావడం విశేషం.బుచ్చి బాబు హీరో పాత్రలను ఊర మాస్ గా చూపిస్తారు . ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా క్రీడా నేపథ్యంలో సాగుతుంది. ఈ గ్లిప్స్ లో పెద్ది పాత్రలో రామ్ చరణ్ బ్యాట్ తో కొట్టిన షాట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. భాష ఏదైనా రాంచరణ్ వాయిస్ సూపర్ అంటున్న మెగా అభిమానులు..