Notice to Manne Krishank: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు నోటీసులు ఇచ్చారు గచ్చిబౌలి పోలీసులు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో AI ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బుధవారం నుంచి మూడు రోజులపాటు విచారణకు రావాలని నోటీసుల్లో ప్రస్తావించారు. మరి క్రిశాంక్ విచారణకు హాజరవుతారా? లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కొత్త మలుపు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. విపక్ష బీఆర్ఎస్ చేసిన డ్యామేజ్‌పై ఫోకస్ చేసింది. దాన్ని కంట్రోల్ చేయడం ప్రారంభించింది. ఆర్టిఫిషియల్ ఉపయోగించి ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ సోషల్ మీడియా విభాగం, ఎన్‌ఎస్‌యూ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్రిశాంక్‌కు నోటీసులు
ఈ క్రమంలో సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై దృష్టి కేంద్రీకరించారు. ఫోటోలు, వీడియోలు AI సహాయంతో చేసినవి తేల్చారు. దీంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణకు రావాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ నోటీసులు ఇచ్చారు గచ్చిబౌలి పోలీసులు. ఈనెల 9 , 10 , 11 న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు అందులో ప్రస్తావించారు.
లభించిన కొన్ని ఆధారాలతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణను కొనసాగిస్తున్నారు. మరోవైపు హెచ్‌సీయూ భూ వివాదంపై సోమవారం హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఏప్రిల్ 24కు వాయిదా వేసింది న్యాయస్థానం. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ తెలిపింది. అయితే ఈ కేసులో కౌంటర్ దాఖలు, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని ఆదేశించింది.
ALSO READ: తెలంగాణలో అది జరగాలంటున్న కోదండరాం, సార్ చెబితే వినాలి
24న న్యాయస్థానంలో విచారణ
హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు, హైకోర్టులో విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నందున ఈనెల 24కు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగేశారు గచ్చిబౌలి పోలీసులు. ఆపై నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు.
తాను ఎక్కడా ఏఐ వాడలేదన్నారు బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్. నోటీసుల వ్యవహారంపై రియాక్టు అయ్యారు. ఇటీవల హెచ్‌సీయూలో విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు అన్నీ వాస్తవమేనన్నారు. తాము లీగల్‌గా ఎదుర్కోంటామన్నారు. జింకలు ఎందుకు రోడ్డు మీదకు వచ్చాయి, ఇళ్లలోకి వెళ్ళినట్టు వీడియోలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం తనపై నాలుగు కేసులు పెట్టిందన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కుట్ర పన్నినట్లు ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు పోలీసులు. డీప్ ఫేక్‌తో క్రియేట్ చేసిన జింక ఫోటోలు, వీడియోలను సేకరించారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
క్రిశాంక్‌తో పాటు ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్లు గుర్తించారు. వీరితోపాటు హెచ్‌సీయూ వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ, ఏబీవీపీ, సీపీఎం కార్యకర్తలు సహా దాదాపు 150 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ALSO READ:హైదరాబాద్‌లో అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవం
బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్ కు నోటీసులు ఇచ్చిన గచ్చిబౌలి పోలీసులు
కంచ గచ్చిబౌలి భూముల్లో AI ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నోటీసులు ఇచ్చిన పోలీసులు
ఈ నెల 9, 10, 11న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు విచారణకి రావాలని నోటీసులు జారీ చేసిన పోలీసులు pic.twitter.com/QKfU9PLCg4
— BIG TV Breaking News (@bigtvtelugu) April 7, 2025