BigTV English

Devara Second Single: ఆ పాట ఏమో కానీ.. ఈయన ఇచ్చిన హైప్ కే పోయేలా ఉన్నాం

Devara Second Single: ఆ పాట ఏమో కానీ.. ఈయన ఇచ్చిన హైప్ కే పోయేలా ఉన్నాం

Devara Second Single: దేవర.. దేవర.. దేవర.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తరువాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు, ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది.


ఆచార్యలో జరిగిన తప్పు మరోసారి జరగకూడదని కొరటాల ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాను చెక్కుతున్నాడు. దానికి ఎన్టీఆర్ కూడా సపోర్ట్ ఇవ్వడంతో.. దేవర మంచి అవుట్ ఫుట్ తో వస్తుందని అభిమానులు బాగా నమ్మకంతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, సాంగ్ రిలీజ్ అయ్యి మరిన్ని అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అంటే హీరోయిన్ జాన్వీ కపూర్. తంగం పాత్రలో అమ్మడు నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకొస్తున్నారు.

ఇక ఇప్పటికే ఫియర్ సాంగ్ రిలీజ్ అయ్యి ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో దేవర మ్యూజిక్ పై ఫ్యాన్స్ బాగా ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు దేవర సెకండ్ సింగిల్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సమయం వస్తుంది అన్నట్లు రెండు రోజులుగా పోస్టర్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మేకర్స్. ఇదొక రొమాంటిక్ సాంగ్ అని, ఇందులో పెద్ద పెద్ద స్టెప్స్ లేకపోయినా ఎన్టీఆర్ – జాన్వీ రొమాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని మొదటినుంచి చెప్పుకొస్తున్నారు.


ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఈ సాంగ్ రిలీజ్ అన్నప్పటి నుంచి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి పెట్టే పోస్టులు వేరే లెవెల్ అని చెప్పాలి. సాంగ్ గురించి, దాని భావం గురించి, ఎన్టీఆర్ హావభావాల గురించి పొల్లు పోకుండా వివరిస్తూ హైప్ పెంచేస్తున్నారు. ” అతనంటే ఎంత మనసో ఎంత మక్కువో ఎంత మోజో తంగం చెబితేనే బాగుంటుంది”. “అంటే అన్నానంటారు గానీ,అద్దిద్దిద్దిద్దిరిపోయింది పాట..ఆ జంట కన్నుల పంట..మాధుర్యపు తూగుటుయ్యాల”. “ప్రియతముడికి ఇలాంటి పాట పడి చాలా కాలమయింది కానీ చాలా మంది చాలా కాలం గుర్తుంచుకుని పాడుకునే పాట కుదిరేసింది…రేపు విని మీరే అంటారా మాట.. ఎక్కువ చెబితే దిష్టి తగుల్తుంది..శుభరాత్రి” అంటూ ముగించారు.

ఇక ఈయన మాటలు విన్నాకా.. ఆ సాంగ్ ఏమో కానీ.. ఈ హైప్ కే పోయేలా ఉన్నామని కొందరు.. ఎక్కించు.. హైప్ ఎక్కించు.. రేపు సోషల్ మీడియా తగలడిపోవాలి గురూజీ అని ఇంకొంతమంది  ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే దేవర సెకండ్ సింగిల్ రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది. మరి ఈ సరస్వతీ పుత్రుడు చెప్పినట్లుగానే సాంగ్ ఉంటుందా.. ? లేదా.. ? తెలియాలంటే రేపటివరకు ఆగక తప్పదు కదా..

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×