BigTV English
Advertisement

Rambha: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన రంభ.. రీ ఎంట్రీ ఎప్పుడంటే?

Rambha: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన రంభ.. రీ ఎంట్రీ ఎప్పుడంటే?

Rambha..ఇండస్ట్రీకి కొత్త కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకుంటారు. అలాంటి వారిలో రంభ (Rambha) ఒకరు.అప్పట్లో రంభ ఎలా ఉండేదంటే ఇప్పుడు శ్రీలీల(SreeLeela) క్రేజ్ లాగే.ఎందుకంటే శ్రీ లీల ఇప్పుడు ఎలా అయితే వరుస సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తోందో.. అప్పట్లో రంభ కూడా అలాగే ఉండేది. ఆమె ఏ సినిమాలో నటించినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా.. రంభకి మాత్రం గుర్తింపు వచ్చేది.అలా అప్పట్లో రంభ అందాలకి ఫిదా అవ్వని యూత్ అంటూ లేరు.అప్పటి యువకులను తన అంద చందాలతో ఫిదా చేసిన హీరోయిన్లలో రంభ ముందు ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ మళ్ళీ రీఎంట్రీ కి సిద్ధమవుతోంది. మరి ఇంతకీ రంభ ఏ హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం..


రీ ఎంట్రీకి సిద్ధమంటున్న రంభ..

కొంతమంది హీరోయిన్లు పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక సినిమాల్లోకి రారు. బిజినెస్ లు చూసుకుంటూ ఉంటారు. మరికొంతమందేమో ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతో సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాంటి వారిలో రంభ కూడా ఒకరు.ఎందుకంటే రీసెంట్ గా రంభ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో మళ్ళీ మీరు సినిమాల్లోకి వస్తారా.. ?రీ ఎంట్రీపై మీ అభిప్రాయం ఏంటి..? సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చింది. రంభ మాట్లాడుతూ..” ఎప్పటికి నా ఫస్ట్ ఛాయిస్ సినిమాలే.. నేను ఇప్పటికి కూడా సినిమాల్లోకి రావాలనే ఆసక్తితోనే ఉన్నాను. రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను.నా సెకండ్ ఇన్నింగ్స్ లో నేను ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.విభిన్నమైన పాత్రలు ఎంచుకొని మళ్లీ అభిమానులను మెప్పించడానికి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నాను” అంటూ రంభ చెప్పుకొచ్చింది. ఇక రంభ మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది దర్శక నిర్మాతలు రంభను తమ సినిమాల్లో కీరోల్స్ కోసం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది .మరి చూడాలి రంభ ఏ హీరో సినిమాతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుంది అనేది.


రంభ సినిమాలు..

ఇక రంభ సినిమాల విషయానికొస్తే..ఇమె మొదట రాజేంద్రప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు(A Okkati Adakku) అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది.ఈ మూవీ హిట్ అవ్వడంతో రంభకి ఇక తిరుగు లేదనిపించింది. ఆ తర్వాత అన్ని భాషల్లో ముఖ్యంగా భోజ్ పురి, కన్నడ,తెలుగు, తమిళ, హిందీ,మలయాళ భాషల్లో ఎక్కువ నటించింది. కేవలం సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా అవకాశాలు తగ్గాక యమదొంగ (Yamadonga), దేశముదురు వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇక పెళ్లయిన తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన ఈ అమ్మడు చాలా ఏళ్ల తర్వాతే రియంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇక త్వరలోనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×