BigTV English

SA vs ENG: బ్యాటింగ్‌ చేయనున్న ఇంగ్లాండ్‌..కర్మకాలి ఓడితే సౌతాఫ్రికా ఇంటికే ?

SA vs ENG: బ్యాటింగ్‌ చేయనున్న ఇంగ్లాండ్‌..కర్మకాలి ఓడితే సౌతాఫ్రికా ఇంటికే ?

SA vs ENG: ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ లో ( champions trophy 2025 ) భాగంగా…ఇవాళ గ్రూప్‌ స్టేజ్‌ లో మరో మ్యాచ్‌ జరుగనుంది. ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా జట్ల ( England vs South Africa ) మధ్య బిగ్‌ ఫైట్‌ ఉంది. సెమీస్‌ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు దక్షిణాఫ్రికా పోరాతూంటే… పరువు కోసం ఇంగ్లాండ్‌ కష్టపడుతోంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ గెలుపు, మరో మ్యాచ్‌ రద్దుతో 3 పాయింట్స్‌ దక్కించుకుంది దక్షిణాఫ్రికా. అదే ఇంగ్లండ్‌ మాత్రం రెండు మ్యాచ్‌ లలో ఒక్కటి కూడా గెలువలేదు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో చిత్తయింది ఇంగ్లాండ్‌. దీంతో…. సెమీస్‌ బరి నుంచి తప్పుకుంది ఇంగ్లాండ్‌. ఇలాంటి తరుణంలోనే…ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ లో ఒక్క మ్యాచ్‌ గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే ప్లాన్‌ తో ఇంగ్లాండ్‌ బరిలోకి దిగుతోంది.


Also Read: Matthew Short Injury: సెమీఫైనల్ కు ముందే ఆసీస్ కు ఎదురుదెబ్బ.. మరో ప్లేయర్ దూరం !

ఇక ఇవాళ్టి మ్యాచ్‌ కరాచీ నేషనల్ స్టేడియంలో ( National Stadium, Karachi ) జరుగుతోంది. ఇంగ్లండ్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా జట్ల మధ్య బిగ్‌ ఫైట్‌ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ మొదట బ్యాటింగ్‌ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో సౌతాఫ్రికా మొదట బౌలింగ్‌ చేయనుంది.  ఇక ఇంగ్లండ్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా జట్ల ( England vs South Africa ) మధ్య ఇప్పటికే జరిగిన వన్డే మ్యాచ్‌ లలో… సఫారీలదే పైచేయి. గత లెక్కలు చూస్తుంటే.. ఇది స్పష్టం అయింది. ఇప్పటి వరకు ఇంగ్లండ్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా జట్ల 70 వన్డే మ్యాచ్‌ లు జరిగాయి.


ఇందులో దక్షిణాఫ్రికా 34 మ్యాచ్‌ లలో విజయం సాధించింది. 30 మ్యాచ్‌ లలో ఇంగ్లాండ్‌ గెలిచింది. అంటే.. దక్షిణాఫ్రికా మంచి ఊపులో ఉందన్న మాట. ఇంగ్లండ్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా జట్ల 5 మ్యాచ్‌ లలో ఫలితం తేలలేదు. ఒకే ఒక్క మ్యాచ్ టై అయింది. ఈ రెండు జట్ల మధ్య చిట్టచివరి 5 వన్డే మ్యాచ్‌ ల రిజల్ట్‌ ఒక్కసారి పరిశీలిస్తే… అక్కడ కూడా ఇంగ్లండ్‌ పైన దక్షిణాఫ్రికా లీడింగ్‌ లో కనిపిస్తోంది. చివరి 5 వన్డే మ్యాచ్‌ లలో 3 మ్యాచ్‌ లలో సౌతాఫ్రికా గెలిచింది. ఒకే ఒక్క మ్యాచ్‌ లో ఇంగ్లాండ్‌ గెలిచింది. ఒక్క మ్యాచ్‌ లో రిజల్ట్‌ రాలేదు. ఈ లెక్కలు పరిశీలిస్తే… ఇవాళ ఇంగ్లాండ్‌ పై సౌతాఫ్రికా గెలిచేలా కనిపిస్తోంది.

Also Read: PSL – IPL: పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ.. PSL ను దెబ్బ కొట్టిన ఐపీఎల్ 2025 ?

ఇంగ్లండ్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా ఇరు జట్ల వివరాలు

 

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్(C), హెన్రిచ్ క్లాసెన్(w), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(w), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×