BigTV English

Rams of the silver screen : వెండితెర రాముళ్లు.. ఆనాటి నుండి ఈనాటి వరకు..

Rams of the silver screen : వెండితెర రాముళ్లు.. ఆనాటి నుండి ఈనాటి వరకు..
Rams of the silver screen


Rams of the silver screen : ఏకపత్నీవ్రతుడు, జానకీ వల్లభ, రామచంద్ర, రాజీవలోచన.. ఇలా రాముడికి ఎన్నో పేర్లు, మరెన్నో అవతరాలు. ప్రతీ అవతారానికి ఒక పేరు, ఒక లక్ష్యం తప్పకుండా ఉంటాయి. అలాగే వెండితెరపై కూడా రాముడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. అలనాటి సీనియర్ ఎన్‌టీఆర్ దగ్గర నుండి ఇప్పటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరకు అందరూ రాముడి రూపాన్ని ప్రేక్షకుల కళ్ల ముందు పెట్టడానికి ప్రయత్నించినవారే. తెలుగు సినిమా అనేది మొదలయినప్పటి నుండి ఎంతమంది హీరోలు, ఏయే విధాలుగా రాముడి అవతారం ఎత్తారో తెలుసా..?

  1. సీనియర్ ఎన్‌టీఆర్
    వెండితెరపై రాముడంటే ఎప్పటికీ సీనియర్ ఎన్‌టీఆరే అన్నట్టుగా ఉండేది ఆయన నటన. ఇప్పటికీ ఆయన అభినయానికి, పాత్రలో ఒదికిపోయే తీరుకు ఎవరూ పేరు పెట్టలేరు. ముఖ్యంగా అది రాముడు, కృష్ణుడు లాంటి పాత్ర అయితే.. ఆ దేవతలే దివి నుండి భూవికి వచ్చారా అనిపించేలా నటిస్తారు. అప్పట్లో రాముడు వేషంలో ఆయన ఉన్న ఫోటోలను ప్రేక్షకులు పూజ గదిలో పెట్టుకునేవారట కూడా. ‘లవ కుశ’, ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’, ‘సీతారామ కళ్యాణం’.. ఇలాంటి క్లాసిక్ సినిమాల్లో రాముడిగా కనిపించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు ఎన్‌టీర్. ఆ రాముడే.. ఈ తారకరాముడిగా తిరిగి వచ్చారేమో అనిపించేలా చేశారు.
  2. పారుపల్లి సుబ్బారావు
    ఇప్పటివరకు లవ కుశ అనే సినిమా.. తెలుగులో ఎన్నోసార్లు రీమేక్ అయ్యింది. చాలామంది నటులు ఇందులో రాముడిగా, లవ కుశులుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. కానీ లవ కుశ సినిమాకు తెలుగు మొదటి వర్షన్ 1934లో విడుదలయ్యింది. అప్పట్లో పారుపల్లి సుబ్బారావు రాముడి పాత్రలో కనిపించి, మొదటి వెండితెర రాముడిగా అందరికీ పరిచమయ్యారు. రామాయణంపై వచ్చిన పలు ఇతర సినిమాల్లో కూడా ఆయన నటించడం విశేషం.
  3. అక్కినేని నాగేశ్వర రావు
    స్క్రీన్‌పై దేవుడి పాత్రలు చేయాలంటే అప్పట్లో దర్శకులకు ముందుగా గుర్తొచ్చే పేరు ఎన్‌టీఆర్ అయితే.. ఆయనకు గట్టి పోటీ ఇచ్చే నటుడిగా అక్కినేని నాగేశ్వర రావు ఉండేవారు. రాముడిగా ఎక్కువగా సినిమాల్లో ఏఎన్ఆర్ నటించకపోయినా.. కొన్ని చిత్రాల్లో ఆయన కృష్ణుడిగా, ఇతర ఇతిహాస పాత్రల్లో కనిపించి అలరించారు. అక్కినేని నాగేశ్వర రావు ‘సీతారామ జననం’ అనే చిత్రంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఈ చిత్రం 1944లో విడుదలయ్యింది. తన మొదటి సినిమాలోనే రాముడిగా నటించిన రికార్డ్ ఇప్పటికీ ఏఎన్ఆర్ సొంతం.
  4. హరనాథ్
    సీనియర్ ఎన్‌టీఆర్ నటుడిగా మాత్రమే కాదు.. దర్శకుడిగా కూడా మంచి గుర్తింపును అందుకున్నారు. అప్పట్లో సీనియర్ దర్శకులు సైతం చేయలేని రిస్కులను ఎన్‌టీఆర్ చూసి చూపించేవారు. ఎన్‌టీఆర్ ముందుగా ‘సీతారామ కళ్యాణం’ అనే సినిమాకు దర్శకత్వం వహించి.. దర్శకుడిగా మొదటిసారి ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ చిత్రంలో ఆయన రాముడి పాత్రలో కాకుండా రావణాసురుడి పాత్రలో కనిపించడం విశేషం. రాముడిగా హరనాథ్ అనే నటుడికి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా వల్ల హరనాథ్‌కు మంచి గుర్తింపు లభించింది.
  5. శోభన్ బాబు
    అలనాటి హీరోలు అందగాడిగా, అమ్మాయిల మనసు దోచుకున్న మన్మథుడిగా గుర్తుండిపోయే పాత్రలు చేశారు శోభన్ బాబు. ఆయన విభిన్న కథలను ఎంచుకుంటూనే ఫ్యామిలీ ఆడియన్స్‌ను, యూత్‌ను ఆకర్షించే సినిమాలను చేసేవారు. అప్పుడప్పుడు పౌరాణిక చిత్రాల్లో కూడా నటించేవారు. అలాంటి ఒక చిత్రమే ‘సంపూర్ణ రామాయణం’. బాపు తెరకెక్కించిన ఈ సంపూర్ణ రామాయణం.. ఇప్పటికీ రామాయణ ఇతిహాసాన్ని ఇష్టపడే చాలామంది ఫేవరెట్ సినిమాగా నిలిచిపోయింది. అంతే కాకుండా ఇందులో రాముడిగా శోభన్ బాబు నటన గురించి కూడా ఇప్పటికీ పలువురు ప్రేక్షకులు మాట్లాడుకుంటారు.
  6. రవికుమార్
    వెండితెరపై రాముడి పాత్రలు చేసినవారు ఎంతోమంది ఉన్నా.. దానిని ఎక్కువసార్లు సినిమాగా మలచిన దర్శకుడు మాత్రం బాపు ఒక్కరే. బాపు.. రామాయణాన్ని ఎన్నోసార్లు ఎన్నో కోణాల్లో మనకు పరిచయం చేశారు. రామాయణం బ్యాక్‌డ్రాప్‌లో బాపు తెరకెక్కించిన ‘సీతా కళ్యాణం’ చిత్రంలో రాముడిగా రవికుమార్ నటించారు. ఇతర సినిమాల్లో ఉన్నట్టుగా ఈ సినిమాలో రాముడికి ఎక్కువగా డైలాగులు ఉండవు. కేవలం ముఖాభినయంతో, అమాయకత్వంతో పాత్రలో ఒదిగిపోయారు రవికుమార్.
  7. శ్రీకాంత్
    తెలుగు సినిమా అనేది మెల్లగా ఇతర భాషా చిత్రాలకు తగినట్టుగా ట్రెండ్ అవుతున్న సమయంలో తెలుగులో వచ్చిన భక్తిరస చిత్రం ‘దేవుళ్లు’. ఈ సినిమా టీవీలో వస్తే ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు అక్కడే కూర్చుండిపోతారు. అలాంటి సినిమాలో రాముడిగా కాసేపు కనిపించి మెప్పించారు శ్రీకాంత్. కనిపించింది కాసేపే అయినా.. శ్రీకాంత్‌ను రాముడిగా అందరికీ గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్‌ను కనబరిచారు.
  8. బాలకృష్ణ
    తండ్రి.. రాముడిగా, దేవుడిగా ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ తన తనయుడు మాత్రం మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అని ప్రేక్షకులు అనుకుంటూ ఉండేవారు. అలాంటి వారికి రాముడిగా తన నటనతో సమాధానం ఇచ్చారు బాలకృష్ణ. బాపు తెరకెక్కించిన ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో రాముడిగా తన డైలాగ్ డెలివరీ, అభినయం.. అన్నీ తన తండ్రిని గుర్తుచేశాయని అప్పటి తరం ప్రేక్షకులు మురిసిపోయారు. 2011లో వచ్చిన ఈ సినిమా.. ఈ తరం ప్రేక్షకులను కూడా మెప్పించి పెద్ద హిట్‌ను అందుకుంది.
  9. జూనియర్ ఎన్‌టీఆర్
    ఎన్‌టీఆర్ కుటుంబంలో ప్రతీ తరం రాముడి అవకాశం వచ్చిన ప్రతీసారి రాముడి పాత్రకు ప్రాణం పోస్తూనే ఉంది. అందుకే జూనియర్ ఎన్‌టీఆర్‌ను కూడా అలాంటి ఒక పాత్రతోనే ప్రేక్షకులకు పరిచయం చేయాలి అనుకున్నారు. ఆయన 13 ఏళ్ల వయసులోనే వెండితెరపై ప్రేక్షకులను పలకరించారు. అది కూడా ‘బాల రామాయణం’ అనే సినిమాలో రాముడి పాత్ర పోషించి. అంత చిన్న వయసులో ఇలాంటి పాత్రను అద్భుతంగా పోషించడం చూసి ప్రేక్షకులు ఇప్పటికీ ఆశ్చర్యపోతారు.
  10. సుమన్
    చూడడానికి చక్కటి రూపు కలిగి ఉండే యాక్టర్లు సినీ పరిశ్రమలో చాలామంది ఉన్నారు. కానీ వారిలో సుమన్ కాస్త ప్రత్యేకం. రాఘవేంద్ర రావు సినిమాల్లో దేవుడి పాత్రలు పోషించిన సుమన్.. అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నారు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామిగా నటించిన సుమన్‌కు ప్రేక్షకుల దగ్గర నుండి విశేష ఆధరణ లభించింది. దీంతో రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘శ్రీరామదాసు’లో కూడా రాముడి పాత్ర కోసం సుమన్‌నే ఎంపిక చేశారు. అప్పటికీ తనపై ప్రేక్షకుల అంచనాలు విపరీతంగా పెరిగిపోయినా.. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా సుమన్ మెప్పించారు.
  11. ప్రభాస్
    అప్పటి తరం వారు ఇతిహాసంపై సినిమాలు చేసేవారు, పౌరాణిక సినిమాలు చేసేవారు.. అందులో వాటి నటన అద్భుతంగా ఉంది అని చెప్పుకోవడం తప్పా ఈతరం అసలు ఏ హీరోలు అయినా ఇలాంటి సినిమాలు చేసే సాహసం చేస్తారా అని ప్రేక్షకులు అనుకుంటూ ఉండేవారు. అలాంటి పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్.. ఈ సాహసం చేయడానికి ముందుకొచ్చాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రమే ‘ఆదిపురుష్’. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ లుక్స్‌పై ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తనను రాముడిగా చూడడానికి రెండు కళ్లు చాలడం లేదని అంటున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×