Ramya Krishna: అందచందాలతో హీరోయిన్ గా ప్రేక్షకులను మెప్పించడమే కాదు విలనిజంతో స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టిన స్టేటస్ ఆమె సొంతం. ఒకప్పుడు గ్లామర్ పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పించిన ఈమె, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా చేస్తూ అలరిస్తోంది. నీలాంబరిగా, శివగామిగా ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూపోతే ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు పోషించి, ప్రేక్షకులను మెప్పించింది. అలాంటి ఈమె.. తనకు ఒక హీరో అంటే భయమని, అతనితో నటించాలంటే వెనుకడుగు వేస్తానని తెలిపింది. మరి ఈమె ఎవరు? ఆ హీరో ఎవరో? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
పాన్ ఇండియా నటిగా గుర్తింపు..
ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని తన అందంతో, నటనతో సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు రమ్యకృష్ణ (Ramya Krishna) . ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో అద్భుతంగా నటించి మెప్పించారు. తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది రమ్యకృష్ణ .ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈమె అప్పటికీ ఇప్పటికీ అంతే అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించిన ఈమె గతంలో నటుడు కమలహాసన్(Kamal Hassan)గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఏముందో ఇప్పుడు చూద్దాం.
కమల్ హాసన్ అంటే భయం..
రమ్యకృష్ణ మాట్లాడుతూ..” నేను ఎంతోమంది హీరోలతో కలిసి నటించాను. అయితే కమల్ హాసన్ సార్ తో నటించాలంటే మాత్రం చాలా భయం వేస్తుంది. అంతేకాదు ఆయనతో నేరుగా డైలాగ్ చెప్పాలంటే ఎవరికైనా సరే భయం పుడుతుంది. అలా ‘పంచతంత్రం’ సినిమాలో నా మొదటి షార్ట్ ఆయనతోనే.. మ్యాగీ పాత్రలో నేను నటించాను. అయితే ఇది ఒక అద్భుతమైన పాత్ర. అలాగే నా పాత్రకు ప్రత్యేకమైన ఆకర్షణ ఉండాలి అని చెప్పారు. ఆ సినిమాలో కమలహాసన్ తో నటించడానికి నేను ఎంతో భయపడ్డాను. కానీ ఆ తర్వాత అంతా సెట్ అయిపోయింది” అంటూ రమ్యకృష్ణ తెలిపింది.ఇక రమ్యకృష్ణ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రమ్యకృష్ణ కెరియర్..
ఇక ఈమె విషయానికి వస్తే, 1985లో వచ్చిన ‘భలే మిత్రులు’ అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్రంలోకి ప్రవేశించి, 1989లో వచ్చిన ‘సూత్రధారులు’ చిత్రం ద్వారా నటిగా మంచి పేరు సంపాదించుకుంది. అయినా సరే ఈమెకు అవకాశాలు మాత్రం రాలేదు. ఒకానొక సమయంలో వరుస ఫ్లాప్ లు ఎదురవుతూ.. ఉండడంతో ఈమెను అందరూ ఐరన్ లెగ్ అంటూ కూడా విమర్శించారు. ఇక తర్వాత 1992లో విడుదలైన ‘అల్లుడుగారు’ సినిమా ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. కే.రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆమె కెరియర్ కు పునాది వేసింది. ఇక తర్వాత ఈమె నటించిన ప్రతి సినిమా కూడా సక్సెస్ అయ్యి, ఈమెకు మంచి పేరు అందించిందని చెప్పవచ్చు. అంతేకాదు ఒకానొక సమయంలో రమ్య కృష్ణ నటిస్తే చాలు.. ఆ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకాన్ని కూడా నిర్మాతలకు కలుగజేసింది. వెండితెర పైనే కాదు బుల్లితెర రంగంలో కూడా పనిచేసింది. ‘జరా మస్తీ జరా ధూమ్’ అనే టీవీ షో కూడా ప్రారంభించింది. ఇక ఉత్తమనటిగా, ఉత్తమ సహాయనటిగా నంది అవార్డులు కూడా అందుకుంది.