BigTV English
Advertisement

Rana: బాలయ్య బాబుకు పోటీగా రానా.. ఇప్పుడు ఇదే ట్రెండ్ మరీ!

Rana: బాలయ్య బాబుకు పోటీగా రానా.. ఇప్పుడు ఇదే ట్రెండ్ మరీ!

The Rana Daggubati Show: ఒకప్పుడు స్టార్ హీరోలంటే కేవలం సినిమాల్లో, వెండితెరపై మాత్రమే కనిపించాలి అనుకునేవారు. వారు ఎక్కువగా ప్రేక్షకులకు మధ్యకు వస్తే వారిని వెండితెరపై చూడాలనుకునే కోరిక తగ్గిపోతుంది అనుకునేవారు. కానీ రోజులు మారిపోయాయి. వెండితెరపై సినిమాలతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్న స్టార్ హీరోలు.. బుల్లితెరపై కూడా వారిని ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. దానికోసం ఓటీటీ, వెబ్ సిరీస్‌లను మాత్రమే కాకుండా టాక్ షోలను కూడా ఎంచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో టాక్ షోలకు విపరీతంగా పాపులారిటీ పెరిగిపోయింది. అందుకే చాలాకాలం క్రితమే టాక్ షోలను వదిలేసిన రానా కూడా మరోసారి రంగంలోకి దిగనున్నాడు.


బాలయ్యే ఇన్‌స్పిరేషన్

బాలకృష్ణ (Balakrishna) లాంటి స్టార్ హీరో అసలు బుల్లితెరపై అడుగుపెడతాడని కూడా ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి ఆయన ఒక టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించడం అనేది ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. అంతే కాకుండా ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) అనే టాక్ షో విపరీతంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే తరహాలో రానా కూడా ఒక టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అసలైతే స్టార్ హీరోలు టాక్ షో చేయవచ్చు అనే ట్రెండ్‌ను ప్రారంభించిందే రానా. ‘నెంబర్ 1 యారీ’ అనే టాక్ షోతో హోస్ట్‌గా మొదటిసారి బాధ్యతలు స్వీకరించాడు రానా. ఇక ఇన్నాళ్ల తర్వాత మరోసారి అదే పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నాడు.


Also Read: రాంగోపాల్ వర్మ కు నోటీసులు.. దెబ్బకు సీన్ రివర్స్..!

మరోసారి అలా

అప్పట్లో రానా హోస్ట్ చేసిన ‘నెంబర్ 1 యారీ’ అనే టాక్ షో బాగా పాపులర్ అయ్యింది. సెలబ్రిటీలను పిలవడం, వారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం, వారితో ఆటలు ఆడించడం.. ఇవన్నీ ఆడియన్స్‌కు కొత్తగా అనిపించాయి. అప్పటివరకు ప్రేక్షకులు ఎన్నో టాక్ షోలను చూసినా.. రానా లాంటి హీరో వచ్చి టాక్ షోను హోస్ట్ చేయడం, వారిని ఎంటర్‌టైన్ చేయడం వారికి బాగా నచ్చింది. అందుకే ‘నెంబర్ 1 యారీ’ కూడా ఒక్క సీజన్‌తో ఆగిపోలేదు. ఈ టాక్ షో ఎండ్ అయిపోయినప్పటి నుండి హోస్ట్‌గా రానాను తన ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. వారికోసమే మరోసారి తను హోస్ట్‌గా మారనున్నాడు.

షూటింగ్ పూర్తయ్యింది

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానున్న ఒక సరికొత్త టాక్ షోను రానా (Rana) హోస్ట్ చేయనున్నాడు. నవంబర్ 23 నుండి ఈ టాక్ షో స్ట్రీమ్ కానుంది. ఇప్పటికే ఈ షో షూటింగ్ కూడా ప్రారంభం అయినట్టు సమాచారం. ఇక రానా షో అంటే రాజమౌళి తప్పకుండా ఉండాల్సిందే. అలా దర్శక ధీరుడు రాజమౌళి ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యిందట. ఆయనతో పాటు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ షోకు గెస్ట్‌గా రానున్నాడని, దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. స్పిరిట్ మీడియా బ్యానర్‌పై ఈ టాక్ షోను రానానే నిర్మిస్తున్నాడు. నవంబర్ 23 నుండి ఈ టాక్ షో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×