Rana Daggubati: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రానా (Rana)ఇటీవల కాలంలో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలకు కమిట్ అవడం, అలాగే వెబ్ సిరీస్ లలో, విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఎంతో బిజీగా గడుపుతున్న రానా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ఈయన దీపికా పదుకొనే (Deepika Padukone)సందీప్ రెడ్డి (Sandeep Reddy)వివాదం గురించి కూడా స్పందించారు.
నటి దీపిక పదుకొనే ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే ఈమె సినిమాలకు కమిట్ అవుతూ బిజీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్(Spirit) సినిమాకి కూడా ఈమె హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. అయితే ఈ సినిమా కోసం పనిచేయటానికి దీపిక కొన్ని కండిషన్లు పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తనకు చిన్న పాప ఉన్న నేపథ్యంలో ఎనిమిది గంటల పాటు షూటింగ్లో పాల్గొననని ఈమె డిమాండ్ చేశారు.. ఇలాంటి డిమాండ్ చేయడంతో అది నచ్చని సందీప్ రెడ్డి ఆమెను వెంటనే ఈ సినిమా నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం ఇచ్చారు.
పని వేళలలో వ్యత్యాసం..
ఇలా ఈ ఘటన గురించి పెద్ద ఎత్తున వివాదం చెలరేగడమే కాకుండా పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ దీపికా పదుకొనేకు మద్దతుగా నిలిచారు. తాజాగా రానా కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ… ఒక సినిమా పరిశ్రమ నుంచి మరొక సినిమా పరిశ్రమకు లేదా ఒక ప్రాజెక్టు నుంచి మరొక ప్రాజెక్టుకు పనిగంటలు చాలా వ్యత్యాసాన్ని చూపుతాయని తెలిపారు. ఇలా ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య పనివేళలో కూడా ఈ విధమైనటువంటి వ్యత్యాసం ఉంటుందని తెలిపారు.
అట్లీ సినిమాకు కండిషన్లు లేవా…
ఇక ఒక సినిమాలో ఒక నటి లేదా నటుడు ఎక్కువ గంటలపాటు పనిచేయాలని ఎవరు బలవంతం చేయరని తెలిపారు. కొంతమంది 8 గంటల పాటు పని చేస్తే, 4 గంటల పాటు పనిచేసే వాళ్లు కూడా ఉన్నారని తెలిపారు.. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఏది ముఖ్యమో దానిపైనే ఒక అభిప్రాయం అనేది ఉంటుందని రానా తెలియచేశారు. ఇక దీపికా పదుకొనే స్పిరిట్ అనే పాన్ ఇండియా సినిమా కోసం ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుందని ఆ సినిమా నుంచి తప్పుకున్నారు అయితే తాజాగా ఈమె అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకు కూడా కమిట్ అయ్యారు. మరి ఈ సినిమాలో నటించడానికి దీపికా కండిషన్లకు చిత్ర బృందం ఒప్పుకున్నారా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైనా దీపిక ఒక భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నప్పటికీ ప్రాజెక్టులో చేసే అవకాశం రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.