Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గత కొన్ని రోజులుగా ఛత్తీస్ గఢ్ అడవుల్లో కాల్పుల మోత మోగుతోంది. గత మూడు రోజుల నుంచి బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్‌లో ఆపరేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్‌మడ్ పర్వతాలతో పాటు 80 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న నేషనల్ పార్కులో భద్రతా బలగాలు అణువణువున జల్లెడ పడుతుండటంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బలు తగలింది. అయితే, ఈ రోజు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. వారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
సంఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిళ్లు, ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దండకారణ్యంలో డీహైడ్రేషన్, తేనెటీగలు దాడి చేయడంతో కొంత మంది పోలీసులకు అస్వస్థత కలిగింది. గాలింపు సమయంలో మరి కొంతమంది గాయాలైనట్టు తెలుస్తోంది. గత మూడు రోజుల నుంచి నేషనల్ పార్క్ లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతోంది. రెండు రోజుల క్రితమే మావోయిస్టు అగ్రనేతలైన సుధాకర్, భాస్కర్ ఇద్దరు పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. సుధాకర్ పై కోటి రూపాయలు, భాస్కర్ పై రూ.25 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం దండకారణ్యంలో ఆపరేషన్ కొనసాగిస్తామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
ALSO READ: రాష్ట్రంలో భారీ పిడుగుల వర్షం.. ఈ జిల్లాల వారు జాగ్రత్తగా ఉండండి.. బయటకు వెళ్తే మాత్రం
దాదాపు 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నేషనల్ పార్క్ ఫారెస్ట్ ఏరియాను మావోయిస్టులు తమకు సురక్షిత ప్రాంతంగా ఊహించారు. ఈ ఏరియాల్లో అసలు పోలీస్ స్టేషన్ కానీ.. క్యాంప్ కానీ లేదు. దాన్ని మావోయిస్టులు అలుసుగా తీసుకున్ని ఇక్కడ ఎక్కువ మొత్తంలో స్థావరం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులను పోలీసులు మట్టుబెడుతున్నారు. ఈ ఆపరేషన్ లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా దళాలు కూడా పాల్గొన్నాయి.
ALSO READ: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 ఉద్యోగాలు
కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్‌మడ్ పర్వతాలతోపాటు నేషనల్ పార్కు వరకు పోలీసులు జల్లెడ పడుతుండటంతో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కొన్ని రోజుల క్రితం పార్టీ దళపతి బస్వరాజ్ ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. నేషనల్ పార్కులో ఇప్పుడు అగ్ర కమాండర్లు చనిపోతున్నారు. ఇదే ప్రాంతంలో భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ అయిన మావోయిస్టు నేత మడావి హిడ్మా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అతడి లక్ష్యంగానే భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ ను కొనసాగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.