Tollywood Hero’s:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత (Samantha) తన భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఎన్నో విమర్శలు, కష్టాలు కూడా ఎదుర్కొంది. ఇక మయోసైటిస్ వ్యాధి బారిన కూడా పడ్డ ఈమె, ఆ వ్యాధి నుంచి బయటపడ్డానికి దాదాపు ఏడాది పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి వరుస సినిమాలతో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే నిర్మాతగా కూడా మారిన ఈమె ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను నిర్మిస్తోంది.. మరోవైపు హిందీలో ఈమె నటించిన ‘సిటాడెల్ హనీ – బన్నీ’ వెబ్ సిరీస్ కూడా విడుదల కాబోతోంది.
ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న సమంత..
ఇదిలా ఉండగా తాజాగా అబుదాబి ఐఫా అవార్డుల వేడుకల్లో పాల్గొన్న సమంత పై స్టార్ హీరోలు సెటైర్లు పేల్చారు. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం. అబుదాబిలో ఐఫా అవార్డుల వేడుక చాలా అట్టహాసంగా జరిగింది. ఈవెంట్ కి యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja), రానా దగ్గుబాటి (Rana Daggubati) హోస్ట్ లుగా వ్యవహరించారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు, హీరోలు, హీరోయిన్లు కూడా సందడి చేశారు. ఇకపోతే ఈ ఐఫా ఈవెంట్ లో సమంత హైలెట్ గా నిలిచింది. ఆమెకి ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. అయితే ఈ అవార్డును బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ (Vicky kaushal) చేతుల మీదుగా సమంత అందుకోవడం విశేషం.
సినిమాలు రావట్లేదు అంటూ బాధపడుతున్న సమంత..
అవార్డు అందుకున్న తర్వాత సమంత మాట్లాడుతూ..”చాలాకాలం తర్వాత మళ్లీ తిరిగి రావడం సంతోషంగా ఉంది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. అన్నింటినీ తట్టుకొని నిలబడ్డాను. మహిళలు ఎవరైనా సరే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మళ్లీ మళ్లీ ఎదుగుతూనే ఉండాలి. అందుకోసం కావాల్సినంత శక్తిని పోగు చేసుకోవాలి” అంటూ సమంత తెలిపింది. ఆ తర్వాత రానా సమంతను ఆటపట్టించే ప్రయత్నం చేశారు. రానా మాట్లాడుతూ..” ఒకప్పుడు మా సిస్టర్ ఇన్ లా నుంచి సిస్టర్ వరకు వెళ్ళింది” అని రానా కామెంట్లు చేశారు. ఆ తర్వాత.” నువ్వేంటి తెలుగు సినిమాలు చేయట్లేదు?” అంటూ రానా ప్రశ్నించగా.. సమంత..” నువ్వు ఎందుకు చేయట్లేదు” అంటూ తిరిగి ప్రశ్నించింది. ” నన్ను ఎవరు తీసుకోవట్లేదు “అని రానా సమాధానం ఇస్తే..” నా పరిస్థితి కూడా అదే”అంటూ సమంత తెలిపింది. మొత్తానికైతే వీరిద్దరికీ తెలుగులో అవకాశాలు రావడం లేదని ప్రత్యక్షంగానే కామెంట్లు చేశారు.
సమంతపై సెటైర్స్ వేసిన స్టార్ హీరోలు..
ఆ తర్వాత సమంత మాట్లాడుతూ..” మనం ఒక సినిమా చేస్తున్నాము అంటే, అది నరసింహ నాయుడులా ఉండాలి.. కానీ రానా నాయుడు లా ఉండకూడదు” అంటూ అదిరిపోయే సెటైర్ వేయగా.. దీనికి రానా కూడా సమంత పరువు తీసేలా కౌంటర్ వేశాడు. ” రానా నాయుడు సినిమా కాదక్కా.. అది ఒక వెబ్ సిరీస్.. వెబ్ సిరీస్ లో మనం ఏమైనా చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ మెన్ చూసే నేను నేర్చుకున్నాను” అంటూ రానా సమంత పరువు తీశాడు. తేజ కూడా సమంతపై సెటైర్ వేశారు. “సమంత ఇంతలా ఎందుకు మాట్లాడుతుందో మీకు తెలుసా..? ఒకప్పుడు సమంత రూత్ ప్రభు ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్ళాక సమంతా రూడ్ ప్రభు అయిపోయింది” అంటూ కామెంట్లు చేశారు. మొత్తానికి అయితే స్టార్ హీరోలు ఇద్దరు సమంత పై సెటైర్ల వర్షం కురిపించారు.